ప్రతి మహిళకు నెలకు రూ.1000, బంపర్ ఆఫర్

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల్లో హీట్ పెరిగింది. ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అప్పుడే హామీల వర్షం కురిపిస్తున్నాయి. నాయకులు పెద్ద పెద్ద వాగ్దానాలు చేసేస్తున్నారు. డీఎంకే చీఫ్ స్టాలిన్ చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది.

ప్రతి మహిళకు నెలకు రూ.1000, బంపర్ ఆఫర్

Rs 1,000 for each women: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల్లో హీట్ పెరిగింది. ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అప్పుడే హామీల వర్షం కురిపిస్తున్నాయి. నాయకులు పెద్ద పెద్ద వాగ్దానాలు చేసేస్తున్నారు. డీఎంకే చీఫ్ స్టాలిన్ చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది.

డీఎంకే అధికారంలోకి వస్తే రేషన్‌కార్డు ఉన్న ప్రతి గృహిణికి నెలకు రూ.1000 ఇస్తామని ఆ పార్టీ చీఫ్‌ ఎంకే స్టాలిన్‌ హామీ ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో త్రిచీలో ఆదివారం(మార్చి 7,2021) భారీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. డీఎంకే కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమిళనాడు అభివృద్ధి కోసం పదేళ్ల వ్యూహాన్ని స్టాలిన్ ప్రకటించారు. వచ్చే దశాబ్ద కాలంలో తమిళనాడును అన్ని రంగాల్లో నెంబర్ 1 స్థానానికి చేర్చడమే ఈ విజన్ లక్ష్యమని అన్నారు.

ఏడు ప్రధాన రంగాలైన ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, నీటి వనరులు, విద్య, ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాలు, సామాజిక న్యాయం విజన్‌ గురించి స్టాలిన్‌ తెలిపారు. సామాజిక న్యాయంలో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డులో ఇంటి అధిపతిగా ఉన్న ప్రతి గృహిణికి నెలకు రూ .1000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్ మొత్తాన్ని రెట్టింపు చేస్తామన్నారు.

మరోవైపు మార్చి 11న పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తామని స్టాలిన్‌ ప్రకటించారు. ఇది ప్రజల మేనిఫెస్టో అని, ప్రజల భాగస్వామ్యంతో రూపొందించినదని తెలిపారు. తమిళనాడు ప్రజలకు కొత్త ఆరంభం కోసం అందులో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. 2006 ఎన్నికల్లో కలైగ్నార్ (కరుణానిధి) విడుదల చేసిన పార్టీ మ్యానిఫెస్టో తరహాలో ఇది ఎన్నికల హీరో అవుతుందని ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో ఆయన చెప్పారు.

ఏప్రిల్ 6న తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ఇందులో భాగంగా పొత్తుల పర్వం నడుస్తోంది. ఇప్పటికే అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. సీట్ల సర్దుబాటు కూడా పూర్తయింది. పీఎంకేతోనూ అన్నాడీఎంకేకు పొత్తు కుదిరింది. పీఎంకేకు 23 సీట్లు కేటాయించారు. మొత్తం 234 సీట్లకుగానూ మిత్రపక్షాలు బీజేపీకి 20, పీఎంకేకి 23 సీట్లను కేటాయించింది డీఎంకే. మిగతా స్థానాల్లో కొన్నింటిని నటుడు విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేకు కేటాయించి, మిగిలిన చోట్ల అధికార అన్నాడీఎంకే పోటీ చేయనుంది. అటు.. డీఎంకే, కాంగ్రెస్ మధ్య కూడా పొత్తులు కుదిరాయి. సీట్లు సర్దుబాటు కూడా పూర్తయింది.

కాంగ్రెస్ పార్టీకి డీఎంకే 24 స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. కాంగ్రెస్ కు 20 స్థానాల్లో పోటీ చేసేందుకు మాత్రమే అవకాశం ఇవ్వాలని డీఎంకే భావించినా, కాంగ్రెస్ పట్టుబట్టడంతో 24 స్థానాల్లో పోటీ చేసేందుకు ఓకే చెప్పింది. 2011 లో 63 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 2016 లో 41 స్థానాలకు పరిమితమైంది. ఇప్పుడు 24 సీట్లకు మాత్రమే పరిమితం కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత నిరుత్సాహం నెలకొంది. తమిళనాడు అసెంబ్లీలో 234 స్థానాలు ఉన్నాయి.