Reserve Bank of India: పెద్దనోటుపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం

2021-22 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా రెండువేల రూపాయల నోట్లను ముద్రించబోమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2020-21లోనూ కొత్తగా రెండువేల నోట్లు ముద్రించలేదని వెల్లడించింది.

Reserve Bank of India: పెద్దనోటుపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం

Reserve Bank Of India

Rs 2000 Note Supply Stopped: 2021-22 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా రెండువేల రూపాయల నోట్లను ముద్రించబోమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2020-21లోనూ కొత్తగా రెండువేల నోట్లు ముద్రించలేదని వెల్లడించింది.

మే 26వ తేదీన ఆర్‌బీఐ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2021 ఆర్థిక సంవత్సరంలో మెత్తంగా కరెన్సీ నోట్ల ముద్రణ 0.3శాతం మేర తగ్గి… 2లక్షల 23వేల 301 లక్షల నోట్లుగా ఉన్నాయి. అదే అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 2 లక్షల 23వేల 875 లక్షలు.

భారత్‌లో 500 నోట్లు, 2వేల నోట్లు.. ఆర్థిక వ్యవస్థలో చెలామణిలో ఉన్న నోట్లలో అత్యధిక కరెన్సీ విలువను కలిగి ఉన్నాయి. చెలామణిలో ఉన్న బ్యాంక్‌ నోట్ల విలువలో వీటి విలువ సుమారు 85.7శాతం. గతేడాది 83.4శాతంలోపోలిస్తే కొంచెం ఎక్కువ. నోట్ల ముద్రణ పరంగా చెలామణిలో ఉన్న అన్ని బ్యాంక్‌ నోట్లలో 500 నోట్ల సంఖ్యే 31.1శాతం.

ఆర్‌బీఐ గత సంవత్సరం వార్షిక నివేదికలో, భద్రతా సమస్యల కారణంగా తాత్కాలికంగా రెండువేల నోటు ముద్రణ నిలిపివేసినట్టు తెలిపింది. 2018 నుంచి వ్యవస్థలో 2వేల కరెన్సీ నోట్లు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ఆర్‌బీఐ రెండువేల నోటును రద్దు చేయకుండా క్రమ క్రమంగా ముద్రణను నిలిపివేస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.