రూ.2000, 500, 200 కరెన్సీ నోట్ల నుంచి కరోనా వ్యాప్తి.. సొల్యూషన్ ఇదే

రూ.2000, 500, 200 కరెన్సీ నోట్ల నుంచి కరోనా వ్యాప్తి.. సొల్యూషన్ ఇదే

ప్రత్యక్ష స్పర్శ.. లేదా కరోనా పాజిటవ్ వ్యక్తులు తాకిన వస్తువుల ద్వారా అయినా కరోనా సంక్రమించే ప్రమాదం ఉన్న మాట వాస్తవం. పదార్థాన్ని బట్టి గంటల సమయం వరకూ బతికి ఉండే ఈ వైరస్.. నోట్లు చేతులు మారితే రాకుండా ఉంటుందా.. ఆస్ట్రేలియా, లండన్, కెనడా లాంటి ప్రాంతాల్లో కరెన్సీ నోట్ల కారణంగా వైరస్ వ్యాప్తి చెందిన సందర్భాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. 

దాని నుంచి తప్పించుకోవాలంటే డిజిటల్ మోడ్ ట్రాన్సాక్షన్లు చేయడం తప్పనిసరి. భారత్ లాంటి దేశంలో నోట్ల వాడకాన్ని పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాని తంతు. మరైతే కరెన్సీ నోట్లకు బదులుగా లావాదేవీలు జరపడానికి ప్రత్యామ్నాయమేంటి. దీని కోసం 2020 మార్చి 17న SBI ఓ కొత్త సొల్యూషన్ వెతికింది. 

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. నోట్ల వినియోగాన్ని అదుపు చేయలేకపోతే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం కష్టం. దీని కోసం మనం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు లండన్, ఆస్ట్రేలియా, కెనడాలు పాలిమర్ నోట్లు తయారు చేసి వైరస్ వ్యాప్తి కాకుండా కాపాడుతున్నాయి. ఇదే తరహాలో భారత్‌లోనూ పాలిమర్ నోట్ల ప్రయోగానికి సిద్ధమైయ్యాయి బ్యాంకులు. 

ప్రజల సేఫ్టీ దృష్టిలో పెట్టుకుని SBI చేసిన రీసెర్చ్‌లో నిజాలు బయటపడ్డాయి. నోట్లపై ఉండే సూక్ష్మ క్రిములు వైరస్ ను వ్యాప్తి చేసేందుకు దోహదపడతాయని ఫలితంగా జబ్బులు, ఇన్ఫెక్షన్లు వస్తాయని అంటున్నారు. ఊహించని తరహాలో జబ్బులు వస్తాయని.. యూరినరీ ఇన్ఫెక్షన్లు, ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు, స్కిన్ ఇన్ఫెక్షన్లు, బ్రెయిన్ లో సమస్యలు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. అంతేకాకుండా షాక్ సిండ్రోమ్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

కరోనా వైరస్ అనేది ఇన్ఫెక్షన్‌తో కూడిన జబ్బు. ప్రత్యక్ష తాకిడి లేదా పరోక్ష స్పర్శ కారణంగా వైరస్ సంక్రమిస్తుంది. ఆరోగ్యానికి ప్రమాదం తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. భారత్‌లో 300మంది ఇన్ఫెక్షన్‌కు గురి అవగా నలుగురు చనిపోయారు. 

See Also | రోనాను ఎదుర్కోవడంలో కేరళ విజయవంతం అయిందిలా..