Stubble-Burning: పొలం తగలబెడితే ఎకరానికి రెండున్నర వేల రూపాయల జరిమానా… కారణం అదే!

రైతులు పొలాలు తగలబెడితే ఎకరానికి రెండున్నర వేల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు ఢిల్లీ, గురుగ్రామ్ అధికారులు. పొలాలు తగలబెట్టడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుందని వారు అంటున్నారు.

Stubble-Burning: చలికాలం వస్తుందంటే చాలు.. ఢిల్లీ వాసుల్లో భయం మొదలవుతుంది. కారణం.. ఈ సీజన్‌లో గాలి కాలుష్యం బాగా పెరగడమే. స్వచ్ఛమైన గాలి అందడం కూడా కష్టమవుతుంది. పొగ మంచు పెరగడం కూడా ఈ సమస్యను మరింత పెంచుతుంది. దీనికితోడు ప్రతి సంవత్సరం ఈ సీజన్‌లో సమీప ప్రాంతాల్లోని రైతులు తమ పొలాలను తగలబెడుతుంటారు.

Leopard Cub: ఫిలిం సిటీలో చిరుత పిల్ల.. తరిమిన కుక్కలు.. పట్టుకుని అధికారులకు అప్పగించిన గార్డ్స్

పంట కోత పూర్తై, చేతికొచ్చిన తర్వాత పొలాల్లో మిగిలిన గడ్డి, చొప్ప వంటివాటిని రైతులు తగలబెడుతుంటారు. వీటిని యంత్రాలతో లేదా కూలీలతో తొలగించడం ఆర్థికంగా భారం అని భావించిన రైతులు, తేలికగా అవుతుందని తగలబెడుతుంటారు. అయితే, వందల ఎకరాల కొద్దీ పొలాలు తగలబెట్టడంతో, వాటి నుంచి వెలువడే పొగ, విష వాయువులు ఢిల్లీ, పరిసర ప్రాంతాల ప్రజలపై తీవ్ర ప్రభవం చూపుతాయి. అసలే వాహనాలు, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యంతో సతమతమవుతున్న ఢిల్లీ వాసులను ఈ పరిస్థితి మరింత ఇబ్బంది పెడుతుంది. అందుకే రైతులు పొలాలు తగలబెట్టకుండా చర్యలు తీసుకుంటున్నారు. గురుగ్రామ్ పరిధిలో రైతులు పొలాల్ని కాల్చేస్తే.. ఎకరానికి రూ.2,500 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

Chinese Visas: భారతీయ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రెండేళ్ల తర్వాత భారతీయ విద్యార్థులకు చైనా వీసా

దీనిపై జిల్లా అధికారులు రైతులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ స్థాయిలో దీన్ని అడ్డుకునేందుకు కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే, రైతులు తమ పొలంలో మిగిలిన గడ్డి, చొప్ప వంటివి తీసేందుకు ఉపయోగించే యంత్రాలపై 50 శాతం రాయితీ ఇస్తామని అధికారులు చెప్పారు. రిజిష్టర్ రైతు సంఘాలకు 80 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైతులు పొలాలు తగలబెట్టకూడదని, దీనివల్ల పర్యావరణం దెబ్బతింటుందని, మూగ జీవాలు, చెట్లు, ప్రకృతిపై ప్రభావం ఉంటుందని, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని అధికారులు సూచిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు