Rs 400 per dose: కేంద్రం నయా ఆర్డర్.. వ్యాక్సిన్ డోస్ ఖరీదు రూ.400

కొవిడ్-19 వ్యాక్సిన్ కొవిషీల్డ్ ధర విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు విభిన్నమైన ధరలు ప్రకటించిన తర్వాత కేంద్రం మరో కొత్త...

Rs 400 per dose: కేంద్రం నయా ఆర్డర్.. వ్యాక్సిన్ డోస్ ఖరీదు రూ.400

Rs 400 Per Dose కేంద్రం నయా ఆర్డర్ వ్య

Rs 400 per dose: కొవిడ్-19 వ్యాక్సిన్ కొవిషీల్డ్ ధర విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు విభిన్నమైన ధరలు ప్రకటించిన తర్వాత కేంద్రం మరో కొత్త ఆలోచనకు వచ్చింది. దీనిపై సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆదార్ పూనావాలా గురువారం కీలక ప్రకటన చేశారు. ఇకపై కేంద్ర ప్రభుత్వం కూడా ఒక్కో డోసుకు రూ.400 చెల్లిస్తుందని వెల్లడించారు.

ముందుగా కేంద్ర ప్రభుత్వం రూ.150, రాష్ట్ర ప్రభుత్వం రూ.400 మాత్రమే వ్యాక్సిన్ కు చెల్లిస్తాయని నిర్ణయించారు. దీనిపై ధరల సవరింపుకు దిగిన సీరం సంస్థ.. ఇప్పటికే 10 కోట్ల వ్యాక్సిన్ డోసులు సప్లై చేశామని కొత్త కాంట్రాక్ట్ సంతకం చేసినప్పుడు మరో 11 కోట్ల డోసులకు కొత్త ధరలను ఫిక్స్ చేస్తామని తెలిపారు.

బుధవారం చేసిన ప్రకటనలో సీరం సంస్థ వ్యాక్సిన్ ధరలు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.400గా, ప్రైవేట్ హాస్పిటల్ కు రూ.600గా నిర్ణయించింది. దేశం కొత్త స్ట్రాటజీ ప్రకారం.. మే1 నుంచి 18ఏళ్లు పై బడ్డ ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలి. సీరం ఇన్ స్టిట్యూట్ కొవీషీల్డ్ వ్యాక్సిన్ 50శాతం రాష్ట్ర ప్రభుత్వాలకు మిగిలింది కేంద్ర ప్రభుత్వానికి పంపించనుంది.