GST : రూ.40 వేల కోట్ల జీఎస్టీ ప‌రిహారం రిలీజ్‌!

జీఎస్టీ ప‌రిహారం కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు కేంద్రం గురువారం రూ.40 వేల కోట్ల నిధులు విడుద‌ల చేసింది. వీటిని బ్యాక్‌టు బ్యాక్ లోన్ ఫెసిలిటీగా రిలీజ్ చేసింది.

GST : రూ.40 వేల కోట్ల జీఎస్టీ ప‌రిహారం రిలీజ్‌!

Gst (2)

GST : జీఎస్టీ ప‌రిహారం కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు కేంద్రం గురువారం రూ.40 వేల కోట్ల నిధులు విడుద‌ల చేసింది. వీటిని బ్యాక్‌టు బ్యాక్ లోన్ ఫెసిలిటీగా రిలీజ్ చేసింది. 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఆర్బీఐ ప్ర‌త్యేక రుణ ప‌ర‌ప‌తి స్కీమ్‌కు ఆమోదం తెలిపింది. దీనికింద రాష్ట్రాలు మొత్తం రూ.1.10 ల‌క్ష‌ల కోట్ల రుణాలు తీసుకున్నాయి.

Read More : GST – Nirmala Sitharaman ‘జీఎస్టీ పరిధిలో వాటిని చేర్చడం సరైన సమయం కాదు’

కాగా జులై15న రూ.75 వేల కోట్ల వ‌ర‌కు రాష్ట్రాలు రుణాల రూపేణా పొందాయి. ఈ ఏడాది చివ‌రిక‌ల్లా ఇది రూ.1.5 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుతుంద‌ని అంచ‌నా. ఇటీవ‌ల ల‌క్నోలో జ‌రిగిన జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు జీఎస్టీ ప‌రిహారం చెల్లింపు అంశాన్ని లేవ‌నెత్తారు. ఈ మేరకు ఈ రోజు నిధులు విడుదల చేసింది కేంద్ర ఆర్ధిక శాఖ

Read More GST On Papad: అప్పడాలపై సోషల్ మీడియాలో రచ్చ.. క్లారిటీ ఇచ్చిన CBIC