గంగలో విగ్రహ నిమజ్జనం చేస్తే 50వేలు ఫైన్

  • Published By: venkaiahnaidu ,Published On : October 3, 2019 / 06:56 AM IST
గంగలో విగ్రహ నిమజ్జనం చేస్తే 50వేలు ఫైన్

గంగా, దాని ఉపనదులలో విగ్రహా నిమజ్జనం చేస్తే 50వేల రూపాయల ఫైన్ విధిస్తామంటోంది కేంద్రప్రభుత్వం. దసరా, దీపావళి, చాత్, సరస్వతి పూజలతో సహా  మరికొన్ని పండుగలు సమీపిస్తున్న సమయంలో గంగానదిలో విగ్రహాన్ని నిమజ్జనం చేయడాన్ని నివారించే దిశగా కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు క్లీన్ గంగా నేషనల్ మిషన్(NMCG)11గంగా పరివాహక రాష్ట్రాల్లోని చీఫ్ సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేసింది.

గత నెలలో ఆయా రాష్ట్రాల ప్రతినిధులు,NMCG అధికారులకు మధ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గంగా మరియు దాని ఉపనదులలో విగ్రహాలను నిమజ్జనం చేయడం మరియు పూజా సామగ్రిని పారవేయడం వంటి నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, పర్యావరణ అనుకూలమైన పద్ధతిలో తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆ ఆదేశాల్లో తెలిపారు.