Fine: రోడ్డుపైకి నీరు వస్తే రూ.50 వేలు జరిమానా

వర్షాకాలం వచ్చిందంటే చాలు రోడ్లపై నీరు నిలుస్తుంటుంది. వర్షపు నీరు రోడ్లపై చేరడం వలన గుంతలు ఉన్నా కనిపించకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారు. అంతే కాదు రోడ్లు డ్యామేజ్ అవుతాయి.

Fine: రోడ్డుపైకి నీరు వస్తే రూ.50 వేలు జరిమానా

Fine

Fine: వర్షాకాలం వచ్చిందంటే చాలు రోడ్లపై నీరు నిలుస్తుంటుంది. వర్షపు నీరు రోడ్లపై చేరడం వలన గుంతలు ఉన్నా కనిపించకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారు. అంతే కాదు రోడ్లు డ్యామేజ్ అవుతాయి. అయితే వర్షాకాలంలో మాత్రమే మనకు ఇలా జరుగుతుంటుంది. కానీ కొన్ని చోట్ల మాత్రం రోడ్లపై నీరు నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. ఇల్లు, అపార్ట్‌మెంట్‌స్ నుంచి నీరు రోడ్లపైకి వస్తుంటుంది. ఇలా రావడం వలన రోడ్లు పాడవుతున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతుంటారు.

అయితే ఇటువంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు తమిళనాడులోని తిరువేర్కాడు మున్సిపాలిటీ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. తిరువేర్కాడు మునిసిపాలిటీ ప్రాంతంలో గృహాలు అపార్ట్‌మెంట్లు, కర్మాగారాల నుంచి రోడ్లపైకి నీరు వస్తే రూ.50 వేలు జరిమానా విధించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ వసంతి తెలిపారు. నిరంతరం రోడ్లపై నీరు రావడం వలన కొత్తగా వేసిన రోడ్లు కూడా కొద్దీ రోజుల్లోనే గుంతలమయమవుతున్నాయని ఆమె వివరించారు. ప్రతి రోజు మున్సిపల్ అధికారులు తిరువేర్కాడు మున్సిపాలిటీ పరిధిలో తిరుగుతారని ఇల్లు, పరిశ్రమల్లోంచి రోడ్లపైకి నీరు వచ్చినట్లు కనిపిస్తే జరిమానా విధిస్తామని తెలిపారు.