RBI report: బ్యాంకులు, బీమా సంస్థలు క్లెయిమ్ చేయని సొమ్ము రూ.70వేల కోట్లు

డిపాజిటర్లు, చట్టపరమైన వారసులు, నామినీల ద్వారా క్లెయిమ్ చేయని రూ.70వేల కోట్లు వివిధ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఎంఎఫ్ఎస్ (మ్యూచువల్ ఫంఢ్ల) వద్ద ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నివేదిక ద్వారా వెల్లడైంది.

RBI report: బ్యాంకులు, బీమా సంస్థలు క్లెయిమ్ చేయని సొమ్ము రూ.70వేల కోట్లు

Cash

RBI report: డిపాజిటర్లు, చట్టపరమైన వారసులు, నామినీల ద్వారా క్లెయిమ్ చేయని రూ.70వేల కోట్లు వివిధ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఎంఎఫ్ఎస్ (మ్యూచువల్ ఫంఢ్ల) వద్ద ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నివేదిక ద్వారా వెల్లడైంది. వీటిలో బ్యాంకుల విషయానికొస్తే FY22(గ్రహీత యొక్క ఆర్థిక సంవత్సరం) చివరి నాటికి క్లెయిమ్ చేయని మొత్తం రూ. 48,200 కోట్లకు పైగా ఉన్నట్లు ఆర్బిఐ తెలిపింది.

Falling Rupee : రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు RBI తీసుకునే చర్యలేమిటి..?

ఇదిలా ఉంటే బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లు SB/CA అకౌంట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు 10 సంవత్సరాలుగా క్లెయిమ్ చేయబడలేదని, గత ఏడాది రూ. 48,200 కోట్లకు పైగా ఉన్నాయని ఆర్బీఐ తన నివేదికలో పేర్కొంది. 2021లో దాదాపు రూ. 39,200 కోట్లు, 2020లో దాదాపు రూ. 24,000 కోట్లు ఉన్నట్లు ఆర్బీఐ నివేదిక ప్రకారం వెల్లడైంది. బీమా కంపెనీల వద్ద క్లెయిమ్ చేయని మొత్తం, మ్యూచువల్ ఫండ్స్, ఇతర క్లెయిమ్ చేయని సెక్యూరిటీలను పరిగణలోకి తీసుకుంటే మార్పు చేర్పుల ద్వారా మొత్తం చాలా పెద్దదిగా ఉంటుంది.

RBI On Cryptocurrencies : ముప్పు తప్పదు.. క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ వార్నింగ్

ఉదాహరణకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) విషయంలో క్లెయిమ్ చేయని మొత్తం దాదాపు రూ. 21,000 కోట్లకు పైగా ఉన్నట్లు ఆర్బీఐ నివేదిక ద్వారా తెలుస్తోంది. బ్యాంకులు ఈ దాదాపు ఉచిత ఫ్లోట్‌ను 10 సంవత్సరాల పాటు తమ వ్యాపార ప్రయోజనాల కోసం సంతోషంగా ఉపయోగించుకుంటాయి. ఆ తర్వాత ఇది RBIచే నిర్వహించబడే డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ (DEAF)కి బదిలీ చేయబడుతుంది. RBI ప్రకారం.. చట్టబద్ధమైన వారసులు/నామినీలు బ్యాంక్ వెబ్‌సైట్‌లో క్లెయిమ్ చేయని మొత్తాలను గుర్తించి, కొన్ని సాధారణ డేటాను అందించి, మిగిలిన మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు.