Fine For Feeding Stray Dogs : వీధి కుక్కలకు ఆహారం పెడుతోందని మహిళకు రూ.8 లక్షలు ఫైన్
వీధి కుక్కలపై ఎంతో దయ చూపుతూ వాటికి ఆహారం అందిస్తున్నందుకు ఓ మహిళకు లక్షల్లో జరిమానా పడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నవీ ముంబైలో జరిగింది. ఆమె పేరు అన్షు సింగ్.

Fine For Feeding Stray Dogs : మూగ జీవాలకు ఆహారం పెట్టి వాటి ఆకలి తీర్చడం మంచిదే కదా. అందులో తప్పేముంది? అది ఏమైనా నేరమా? అనే అనుమానం మీకు కలగొచ్చు. నిజమే.. మూగ జీవాలకు ఆహారం పెట్టడం మంచి పనే. కానీ, అక్కడ మాత్రం.. అదే ఆమె పాలిట శాపమైంది.
వివరాల్లోకి వెళితే.. వీధి కుక్కలపై ఎంతో దయ చూపుతూ వాటికి ఆహారం అందిస్తున్నందుకు ఓ మహిళకు లక్షల్లో జరిమానా పడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నవీ ముంబైలో జరిగింది. ఆమె పేరు అన్షు సింగ్. ఓ ఎన్నారై హౌసింగ్ కాంప్లెక్స్ లో నివాసం ఉంటుంది. అదే కాంప్లెక్స్ లో 40 వరకు ఇళ్లు ఉన్నాయి.
Lose Weight : బరువు తగ్గాలంటే… ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లోకి ఇవి తీసుకోండి
కాగా, అన్షు సింగ్ రోజూ వీధి కుక్కలకు ఆహారం పెడుతుంది. ఇది మంచి పనే కదా. ఇందులో తప్పేముంది? అని సందేహం రావొచ్చు. అన్షు సింగ్ చేసే పనిని హౌసింగ్ కాంప్లెక్స్ లో నివాసం ఉంటున్న వాళ్లకు నచ్చలేదు. వారు ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. తమ హౌసింగ్ కాంప్లెక్స్ లో వీధి కుక్కలతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని మేనేజింగ్ కమిటీకి వాళ్లు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులను పరిశీలించిన కమిటీ.. అన్షు సింగ్ పై సీరియస్ అయ్యింది. కమిటీ నిబంధనల మేరకు జరిమానా విధించారు.
ఆ హౌసింగ్ కాంప్లెక్స్ లో వీధి కుక్కులకు ఆహారం వేస్తే రోజుకు రూ.5 వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆ లెక్కన అన్షు సింగ్ కు ఇప్పటివరకు విధించిన జరిమానాల మొత్తం రూ.8 లక్షల చేరింది. కాంప్లెక్స్ లోపల వీధి కుక్కలకు ఆహారం పెట్టే వారి పేర్లను వాచ్ మన్ నమోదు చేసుకుంటాడు.
Vegetables : మాంసంలో లేని ప్రత్యేకతలు కూరగాయల్లో ఉన్నాయా?
హౌసింగ్ కాంప్లెక్స్ లోపల వీధి కుక్కలు విచ్చల విడిగా సంచరిస్తుండడంతో పిల్లలు ట్యూషన్లకు వెళ్లలేకపోతున్నారని, వృద్ధులు అసౌకర్యానికి గురవుతున్నారని హౌసింగ్ కాంప్లెక్స్ కార్యదర్శి వినీత శ్రీనందన్ చెప్పారు. అంతేకాదు పార్కింగ్ ప్లేస్ తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ కుక్కలు అపరిశుభ్రతకు కారణమవుతున్నాయని, కాంప్లెక్స్ లోపల కుక్కలతో రణరంగంలా మారిందని వాపోయారు. దాంతో ఇక్కడ నివాసం ఉండేవారు సరిగా నిద్రపోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వీధి కుక్కల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నప్పటికీ, వాటికి బహిరంగ ప్రదేశాల్లో ఆహారం అందిస్తున్నారని వినీత ఆరోపించారు. కాంప్లెక్స్ లో లోపల వీధి కుక్కలకు ఆహారం పెడితే ఫైన్ విధించే నిబంధనను జూలై 2021 నుంచి అమలు చేస్తున్నారు. కాగా, కుక్కలకు ఆహారం పెడుతోందని ఇదే కాంప్లెక్స్ లో నివాసం ఉంటున్న మరో మహిళకు కూడా రూ.6లక్షలు ఫైన్ విధించారు.
- Husband Suicide: భార్యకు చీర సరిగా కట్టుకొవడం రాదని సూసైడ్ చేసుకున్న భర్త
- boy suicide attempt: చదువుకోమన్నందుకు బాలుడు ఆత్మహత్యా యత్నం
- Maharashtra : పోలీసు పరీక్షలో ఆమెగా పాస్,మెడికల్ టెస్ట్‌లో అతడుగా ఫెయిల్
- Maharashtra : ప్రాణాలను పణంగా పెట్టి ఆగిపోయిన రైలును తిరిగి నడిపిన లోకో పైలట్
- Loan Recovery Agents : లోన్ రికవరీ ఏజెంట్ల దాష్టీకం-వ్యక్తి ఆత్మహత్య
1Rapido : యువతులను వేధించిన ర్యాపిడో బైక్ డ్రైవర్ అరెస్ట్
2Kidney Stones : కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయో తెలుసా?
3LG OLED TV: చుట్టగా చుట్టేసే టీవీని విడుదల చేసిన ఎల్జీ సంస్థ: ధర ఎంతో తెలుసా?
4Sheep jailed for 3 years: మహిళను చంపిన గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు..!
5No CPS Only OPS : సీపీఎస్ రద్దు చేసి.. ఓపీఎస్ అమలు చేయాల్సిందే-ఉద్యోగ సంఘాలు
6Godfather: సల్మాన్‌తో కలిసి చిందులేసేందుకు రెడీ అవుతోన్న మెగాస్టార్..?
7Sapota : పోషకాలను అందించటంతోపాటు, ఒత్తిడిని పోగొట్టే సపోటా!
8Gyanvapi Temple: కాశీలో ప్రతిదీ పరమ శివుడికి చెందినదే: కేంద్ర మంత్రి
9Monkeypox Treatment: మంకీపాక్స్ ట్రీట్మెంట్కు ట్రైనింగ్ తీసుకుంటున్న బెంగళూరు డాక్టర్లు
10Madhya Pradesh : వివాహేతరం సంబంధంపై అనుమానం-స్నేహితుడిని చంపి పూడ్చిపెట్టిన జంట
-
Bihar CM Nitish: అప్పట్లో మా తరగతిలో ఒక్క అమ్మాయి కూడా లేదు: బీహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యలు
-
Agent: ఓటీటీ పార్ట్నర్ను లాక్ చేసుకున్న ఏజెంట్
-
Minister Roja: జగన్ లాంటి సీఎం భూతద్దంలో వెతికినా దేశంలో ఎక్కడా కనిపించడు: మంత్రి రోజా
-
After Exercise : వ్యాయామం తరువాత నిస్సత్తువ తగ్గాలంటే!
-
Uyghurs in China: చైనాలో “ఉయ్ఘర్స్ నిర్బంధ శిబిరాలు”: జింజియాంగ్ ప్రాంతంలో యూఎన్ ప్రతినిధి పర్యటన
-
Diabetes : మధుమేహంతో బాధపడుతున్నారా? భయపడాల్సిన పనిలేదు
-
Major: సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న మేజర్
-
Ram Pothineni: కొత్త సినిమా లాంఛ్‌కు ముహూర్తం పెట్టిన రామ్..?