Manmohan Singh : మాజీ ప్రధానికి సెలవులు మంజూరు చేసిన వెంకయ్య
దేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(89)కు సెలవులు మంజూరు చేశారు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న మన్మోహన్ కి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా పార

Venkaiah
Manmohan Singh : దేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(89)కు సెలవులు మంజూరు చేశారు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న మన్మోహన్ కి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా పార్లమెంటు శీతాకాల సమావేశాలకు గైర్హాజరయ్యేందుకు వెంకయ్యనాయుడు అనుమతించారు. సెలవులకు సంబంధించిన దరఖాస్తు చైర్మన్ టేబుల్ దగ్గరికి వచ్చిన తర్వాత వెంకయ్య ఈ ప్రకటన చేశారు.
“డాక్టర్ మన్మోహన్ సింగ్ నుంచి లేఖ అందింది. అనారోగ్య కారణాలతో శీతాకాల సమావేశాలకు హాజరుకాలేనని అందులో పేర్కొన్నారు. అందుకు అనుమతిస్తున్నాం. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు జరుగుతున్న మొత్తం శీతాకాల సమావేశాలకు సెలవులు మంజూరు చేస్తున్నాం”అని వెంకయ్య నాయుడు తెలిపారు.
కాగా, రెండు నెలల క్రితం గుండె సంబంధింత సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్‌లో మన్మోహన్ సింగ్ కొద్ది రోజులు ట్రీట్మెంట్ పొందిన విషయం తెలిసిందే.
ALSO READ AAP MLA : ఎమ్మెల్యే భర్తమీద కేసు పెట్టిందని ‘తల్లీబిడ్డల్ని’ దారుణంగా కొట్టిన దుండగులు.. వీడియో