దేశవ్యాప్తంగా పట్టుబడుతున్న కోట్లాది రూపాయలు

  • Published By: chvmurthy ,Published On : March 29, 2019 / 03:24 PM IST
దేశవ్యాప్తంగా పట్టుబడుతున్న కోట్లాది రూపాయలు

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల  సందర్బంగా ,  ఇప్పటి వరకు దేశంలో  చేపట్టిన తనిఖీల్లో మొత్తం రూ.1253.59 కోట్ల విలువజేసే సొత్తు  స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర  ఎన్నికల సంఘం ప్రకడటించింది. దీంట్లో ల సరైన  పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.250.188 కోట్ల నగదు, రూ.122.339 కోట్ల విలువైన మద్యం, రూ. 675.741 కోట్ల విలువచేసే మాదకద్రవ్యాలు, రూ.183.09 కోట్ల విలువైన నగలు, రూ.22.22 కోట్ల విలువైన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 

కాగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో రూ. 18.70 కోట్ల నగదు, రూ. 2.67 కోట్లు విలువచేసే 2.20 లక్షల లీటర్ల మద్యం, రూ.2.48 కోట్ల విలువచేసే మాదకద్రవ్యాలు, రూ. 24.17 కోట్ల విలువచేసే ఇతర సొత్తును స్వాధీనం చేసుకున్నారు.