2వేల నోట్లు రద్దు! : ప్రింట్ ఆగింది…ATMలో కనబడట్లేదు

  • Published By: venkaiahnaidu ,Published On : February 10, 2020 / 10:06 AM IST
2వేల నోట్లు రద్దు! : ప్రింట్ ఆగింది…ATMలో కనబడట్లేదు

దేశవ్యాప్తంగా కొన్ని రోజులుగా 2వేల రూపాయల నోట్లు పెద్దగా ఏటీఎంలలో కనిపించడం లేదు. అసలు త్వరలో ఈ 2వేల రూపాయల నోట్లు కనుమరుగు కానున్నట్లు ప్రస్తుత పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. నల్లధనం అరికట్టే పేరుతో 2016లో మోడీ సర్కార్ పాత 500,1000రూపాయల నోట్లను రద్దు చేసిన విషయం భారతీయులందరికీ తెలిసిన విషయమే. ఆ సమయంలో 1000రూపాయల స్థానంలో 2వేల రూపాయల నోటును తీసుకొచ్చింది ఆర్బీఐ. 

అయితే ప్రస్తుతం 2వేల రూపాయల నోట్లు పెద్దగా చలామణిలో కనిపించడం లేదు. దీనికి కారణం ఏంటని ఆరా తీయగా…2వేల రూపాయల నోట్ల చలామణిపై ఓ పబ్లిక్ సెక్టార్ ఆంక్షలు విధించినట్లు తెలిసింది. అంతేకాకుండా 2వేల రూపాయల నోట్లను ఏటీఎంలలో కూడా పెట్టదని ఆంక్షలు విధించిందట. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఏటీఎంలలో 200,500,100రూపాయల నోట్లను మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆ బ్యాంకు సీనియర్ మేనేజ్ మెంట్,అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే చలామణిలో 2వేల రూపాయల నోట్లపై మాత్రమే ఆంక్షలు విధించామని,ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడానికి కస్టమర్లు తీసుకొచ్చే 2వేల రూపాయల నోట్లను తీసుకుంటామని ఆ బ్యాంకు తెలిపింది. 

అయితే పబ్లిక్ సెక్టార్ బ్యాంకు 2వేల రూపాయల నోట్ల చలామణిపై ఎందుకు ఆంక్షలు విధించిందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఓ ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా…2019 అక్టోబర్ నుంచే 2వేల రూపాయల నోట్ల ప్రింటింగ్ నిలిపివేసినట్లు రిజర్వ్ బ్యాంకు తెలిపింది. 2వేల రూపాయల నోట్ల రూపంలో పెద్ద మొత్తంలో ఫేక్ కరెన్సీ నోట్లు దొరకడంతోనే 2వేల రూపాయల నోట్ల చలామణిపై ఆంక్షలు విధించినట్లు అర్థమవుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NRCB)డేటా ప్రకారం…ఇప్పటివరకు సీజ్ అయిన 2,000 రూపాయల కరెన్సీ నోట్లలో 50% కంటే ఎక్కువ నకిలీవని తేలింది.

రిపోర్ట్ ప్రకారం…ముంబైలోని కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆప్ బరోడా ఎటిఎంలలో 4,000, 6,000 విత్ డ్రావల్ అమోంట్ క్లిక్ చేస్తే 2వేల రూపాయల నోట్లు రావడం లేదట. అయితే ఆంధ్రాబ్యాంక్ ఏటీఎంలో మాత్రం 2వేల రూపాయల నోట్లు వస్తున్నాయట. మొత్తానికి త్వరలో 2వేల రూపాయల నోటు కూడా చరిత్రలో కలిసిపోతుందా లేదా అనేది చూడాలి.