నిర్భయ దోషుల రక్షణ కోసం రోజుకు రూ.50 వేల ఖర్చు

నిర్భయ దోషులకు ఉరి తీయడంలో జరుగుతున్న జాప్యం వల్ల జైలు అధికారులకు ఖర్చు కూడా పెరుగుతోంది. ఇందుకు గాను రోజుకు 50 వేలు ఖర్చవుతోంది.

  • Published By: veegamteam ,Published On : January 23, 2020 / 08:49 PM IST
నిర్భయ దోషుల రక్షణ కోసం రోజుకు రూ.50 వేల ఖర్చు

నిర్భయ దోషులకు ఉరి తీయడంలో జరుగుతున్న జాప్యం వల్ల జైలు అధికారులకు ఖర్చు కూడా పెరుగుతోంది. ఇందుకు గాను రోజుకు 50 వేలు ఖర్చవుతోంది.

నిర్భయ దోషులకు ఉరి తీయడంలో జరుగుతున్న జాప్యం వల్ల జైలు అధికారులకు ఖర్చు కూడా పెరుగుతోంది. దోషుల భద్రత తలకు మించిన భారంగా మారుతోంది. దోషుల కాపలా కోసం ప్రతి  రోజు 50 వేలు ఖర్చవుతోంది.

నిర్భయ అత్యాచారం కేసులో దోషులకు డెత్‌ వారెంట్‌ జారీ చేసినప్పటి నుంచి వారికి భద్రత కల్పించడం జైలు అధికారులకు భారంగా మారుతోంది. ఇందుకు గాను రోజుకు 50 వేలు ఖర్చవుతోంది. దోషులు ఎలాంటి అకృత్యాలకు  పాల్పడకుండా పోలీసులు వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. వారికి 32 మంది సెక్యూరిటీ  సిబ్బంది కాపలాగా ఉంటున్నారు.  ఇక ఉరితీతకు సంబంధించిన పనుల ఖర్చు కూడా తడిసి  మోపెడవుతోంది.

నిర్భయ దోషులను తీహార్‌ జైలులోని వేరు వేరు సెల్‌లో ఉంచారు. ప్రతి దోషి సెల్‌ ముందు ఇద్దరు  సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేశారు. ఇందులో ఒకరు హిందీ, ఇంగ్లీష్‌ భాష రాని తమిళ జవాన్‌  కాపలా ఉంటారు. మరొకరు తీహార్‌ జైలు సిబ్బందికి చెందిన జవాన్‌ను నియమించారు. ప్రతి రెండు  గంటలకు సెక్యూరిటీ గార్డ్‌ షిఫ్ట్‌ మారుతుంది. అంటే ప్రతిరోజు ఒక్కొక్క ఖైదీకి 8 మంది చొప్పున  కాపలా కాస్తున్నారు. నలుగురు ఖైదీలకు కలిపి ప్రతి రోజు 48 షిఫ్ట్‌ల చొప్పున పనిచేస్తున్నారు.

నిర్భయ దోషులకు డెత్‌ వారెంట్ జారీ కాకముందు ఇతర ఖైదీలతో పాటే వారిని ఉంచేవారు. డెత్‌  వారెంట్‌ జారీ అయ్యాక వారికి భద్రతను పెంచారు. ఎందుకంటే దోషులు ఆత్మహత్యల్లాంటి చర్యలకు  పాల్పడవచ్చు…లేదా జైలు నుంచి పారిపోయేందుకు ప్రయత్నించవచ్చు. వారు ఇతరత్రా చర్యలకు  పాల్పడకుండా ఉండేందుకే సెక్యూరిటీ సిబ్బంది కంటి మీద కునుకు లేకుండా కాపలా కాస్తారు.  ఉరితీయడానికి ముందు వారు ప్రశాంతంగా ఉండేలా చూస్తారు. సీసీటీవీ కెమెరాల నిఘా కూడా  ఉంటుంది.