ఆడపిల్లను వేధించాడని RSS కార్యకర్త హత్య 

  • Published By: veegamteam ,Published On : September 16, 2019 / 06:30 AM IST
ఆడపిల్లను వేధించాడని RSS  కార్యకర్త హత్య 

ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్య కేసుని పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కార్యకర్తను హత్య చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను ఆదివారం (సెప్టెంబర్ 15)న పోలీసులు అరెస్ట్ చేశారు. 

కార్వరా గ్రామంలో శనివారం (సెప్టెంబర్ 14)న పంకజ్ (23) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ హత్య వెనుక ముగ్గురు ఉన్నట్లుగా అనుమానించారు.  దర్యాప్తులో భాగంగా..ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా హత్య తామే చేశామని ఒప్పుకున్నారు. 

ఈ కేసు విషయంలో  సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ యాదవ్ మాట్లాడుతూ..పంకజ్ టిటావై ప్రాంతంలోని కార్వార్‌ గ్రామానికి చెందిన వాడనీ..అతను బాఘ్రాలోని స్వామి కళ్యాందేవ్ డిగ్రీ కాలేజ్ లో బిఎ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. గత కొన్ని నెలల నుండి తన కుమార్తెను వేధిస్తున్న పంకజ్ ను యువతి తండ్రీ కవరపాల్ అతని కుమారుడు మోను,కవరపాల్ సోదరుడు  ప్రమోద్ లు కలిసి  హత్య చేశారని తెలిపారు. పంకజ్ శుక్రవారం బాగ్రాకు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన ముగ్గురు పంకజ్ ను హత్య చేసినట్లుగా నిందుతులు అంగీకరించారని..సూపరింటెండెంట్ తెలిపారు.

కవరపాల్, అతని కుమారుడిని  ఆదివారం సాయంత్రం అరెస్టు చేశామనీ హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామనీ..ఈ కేసులో మూడవ నిందితుడి కోసం గాలిస్తున్నామని  సూపరింటెండెంట్ తెలిపారు.