Mohan Bhagwat : ఆర్ఎస్ఎస్ చీఫ్ కు కరోనా
రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ కరోనా బారిన పడ్డారు. పరీక్షలు చేయగా..కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది.

Mohan Bhagwat
RSS Chief : రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ కరోనా బారిన పడ్డారు. పరీక్షలు చేయగా..కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. సాధారణ లక్షణాలు కనిపించడంతో ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపింది. దీంతో నాగ్ పూర్ లోని కింగ్స్ వే ఆసుపత్రిలో చేరారు. సాధారణ పరీక్షలు జరిపారని, వైద్యులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని వెల్లడించింది. మోహన్ భగవత్ కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది.
ప్రస్తుతం ఆయనకు కరోనా వైరస్ సాధారణ లక్షణాలు ఉన్నాయి. ఈ మేరకు భగవత్ నాగ్‌పూర్‌లోని కింగ్స్‌వే హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. అంటూ ఆర్ఎస్ఎస్ ట్వీట్ లో వెల్లడించింది. అయితే..మార్చి 07వ తేదీన కరోనా వ్యాక్సిన్ తొలి డోసు భగవత్ తీసుకున్నారు. అయినప్పటికీ కరోనా బారిన పడ్డారు. ఇక మహారాష్ట్రలో కరోనా పంజా విసురుతోంది. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు రికార్డవుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో 58 వేల 993 కరోనా కేసులు రికార్డవగా..301 మంది చనిపోయారు. ముంబైలో 9 వేల 200 కేసులు, 35 మంది మృతి చెందారు.
राष्ट्रीय स्वयंसेवक संघ के परमपूजनीय सरसंघचालक डॉ. मोहनजी भागवत आज दोपहर कोरोना पॉज़ीटिव हुये है। अभी उन्हें कोरोना के सामान्य लक्षण हैं तथा वे सामान्य जाँच और सावधानी के नाते नागपुर के किंग्ज़वे अस्पताल में भर्ती हुए हैं।
— RSS (@RSSorg) April 9, 2021
Read More : Tenth Class Exams : పదో తరగతి విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్