మోడీ సర్కార్ పై RSS విమర్శలు..2025లోనే రామమందిర నిర్మాణం

  • Published By: venkaiahnaidu ,Published On : January 18, 2019 / 11:06 AM IST
మోడీ సర్కార్ పై RSS  విమర్శలు..2025లోనే రామమందిర నిర్మాణం

నరేంద్రమోడీ ప్రభుత్వ పనితీరుపై ఆరెస్సెస్ మరోసారి విమర్శలు గుప్పించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలు కోల్పోడం అనే రెండు ప్రధాన అంశాల్లో మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం ఆలస్యమవడంపై ఆగ్రహం వ్యక్తిన సీనియర్ ఆరెస్సెస్ లీడర్ భయ్యాజి జోషి 2025లో రామమందిర నిర్మాణం ఇప్పుడు 2025లో జరుగుతుందంటూ మోడీ సర్కార్ పై వ్యంగాస్త్రాలు సంధించారు.

నాగ్ పూర్ లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్లొన్న ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ..యుద్ధం జరుగకపోతున్నప్పటికీ దేశ సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని భగవత్ అన్నారు. మన ఉద్యగం మనం సక్రమంగా చేయకపోవడం వల్లనే ఇదంతా అని పరోక్షంగా మోడీ సర్కారుని విమర్శించారు. యుద్ధం లేకుండా, ఏ కారణం లేకుండా సరిహద్దుల్లో సైనికులు ఎందుకు చనిపోవాలని భగవత్ ప్రశ్నించారు. సైనికుల ప్రాణాలు పోకుండా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని భగవత్ తెలిపారు. దేశాన్ని గొప్పగా నిలబెట్టేంతవరకు ప్రజలు ఎప్పుడూ పోరాడాలని ఆయన తెలిపారు.