బీహర్ ఫలితాలు వచ్చాక కర్ణాటకలో ముఖ్యమంత్రి మారిపోతారు

  • Published By: vamsi ,Published On : November 9, 2020 / 11:54 AM IST
బీహర్ ఫలితాలు వచ్చాక కర్ణాటకలో ముఖ్యమంత్రి మారిపోతారు

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారడానికి కారణం అవుతుందా? అవుననే అంటున్నారు కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య. కర్ణాటకలో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి కచ్చితంగా మారిపోయే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వంలో దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లుగా వెల్లడించారు.



కర్ణాటక రాష్ట్రంలో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా.. అక్కడి ఫలితాల్లో కాంగ్రెస్‌ ఓటమి తర్వాత.. ఆ పార్టీ ప్రతిపక్ష నేతగా సిద్ధ రామయ్యను తొలగిస్తుందని యడ్యూరప్ప చెప్పిన కొద్దిరోజులకే సిద్ధి రాయయ్య ఇలా స్పందించారు. ఈ మేరకు శివమొగ్గలో ఆదివారం సిద్ధిరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిని మార్చేందుకు ఆరు నెలలుగా బీజేపీ కసరత్తు చేస్తోందని చెప్పారు. ప్రభుత్వంలో అవినీతి పేరుకుపోవడంతో ఆ దిశగా ఆలోచన చేస్తోందని అన్నారు.



యడ్యూరప్ప వయసు ప్రస్తుతం 77ఏళ్లు కాగా.. ఆ కారణంగా కూడా అతనిని సీఎం సీటు నుంచి దించే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి, అయితే సిద్ధి రామయ్య వ్యాఖ్యలను ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం తోసిపుచ్చుతోంది.



ఇదే సమయంలో నవండర్ 3న సిరా, ఆర్‌ఆర్‌ నగర్‌ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని చెప్పిన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను సిద్ధ రామయ్య తోసిపుచ్చారు. రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. అలాగే బిహార్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని అన్నారు. బీహార్‌లో మహా కూటమి అధికారంలోకి రాబోతోందని అన్నారు.