Russia And Ukraine War : లీటర్ పెట్రోల్ రూ. 120-125 ? త్వరలోనే పెంపు ?

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో భారీగా ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యా-యుక్రెయిన్ యుద్ధంతో ముడిచమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా

Russia And Ukraine War : లీటర్ పెట్రోల్ రూ. 120-125 ? త్వరలోనే పెంపు ?

Petrol

Petrol, Diesel Prices Go Up In India : ఉక్రెయిన్ దేశంపై రష్యా చేపడుతున్న యుద్ధం ఇతర రంగాలపై తీవ్ర ప్రభావం చూపెడుతోంది. చమురు ధరలకు అమాంతం రెక్కలు వచ్చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. కానీ.. భారత్ లో మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. దీనికంతటికి కారణం ఐదు రాష్ట్రాల ఎన్నికలేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు లేదా ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ధరల విషయంలో పెట్రోలియం కంపెనీలు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ధరలను పెంచితే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని, దీంతో ఎన్నికలపై ప్రభావం చూపెడుతుందని..అందుకే ధరల జోలికి వెళ్లడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. త్వరలోనే భారత్ లో చమురు ధరలు పెంచడం ఖాయమంటున్నారు.

Read More : Sri Lanka : రష్యా – యుక్రెయిన్ యుద్ధం, లీటర్ పెట్రోల్ రూ. 204!

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో భారీగా ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యా-యుక్రెయిన్ యుద్ధంతో ముడిచమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడ్‌ ధర 111డాలర్లకు పైగా ఉంది. ముడిచమురు ఒక్కరోజుల్లోనే 6శాతానికి పైగా పెరిగింది. రష్యా, యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండటం.. మరోవైపు రష్యాపై ఆంక్షలు ముడిచమురును రగిలిస్తున్నాయి. ముడిచమురు ధరలను కట్టడి చేసేందుకు ప్రపంచదేశాలు చర్యలు తీసుకున్నా ధరల దూకుడు మాత్రం తగ్గడం లేదు.

Read More : Petrol Prices: భారత్‌కి బ్యాడ్ న్యూస్, యుద్ధం దెబ్బకు భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

అమెరికా తమ వ్యూహాత్మక చమురు నిల్వలనుంచి భారీగా చమురును బయటకు తీసేందుకు ఒప్పుకుంది. మొత్తం 31దేశాలు 6కోట్ల బ్యారెళ్ల ముడిచమురును బయటకు తీయాలని నిర్ణయించుకున్నాయి. అయినా ముడి చమురు ధరలకు మాత్రం బ్రేక్‌ పడటం లేదు. ముఖ్యంగా యూరోప్‌పై దీని ప్రభావం గట్టిగా పడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి అమెరికా కానీ ఈయూ కానీ ముడిచమురు సరఫరాకు సంబంధించిన అంశాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అయితే రష్యా ఇదే దూకుడుతో వెళితే మాత్రం ఆ పరంగా కూడా ఇబ్బందులు తప్పవు. అదే జరిగితే క్రూడ్‌ ధర 150 డాలర్లకు చేరుతుందన్న హెచ్చరికలున్నాయి.