వ్యాక్సినేషన్ ప్రక్రియలో ముందడుగు.. ఒక్క డోసు చాలు!

వ్యాక్సినేషన్ ప్రక్రియలో ముందడుగు.. ఒక్క డోసు చాలు!

Russia Approves Sputnik Light A Single Dose Vaccine With 80 Efficacy

Sputnik Light: స్పుత్నిక్-వి కరోనావైరస్ వ్యాక్సిన్ సింగిల్-డోస్ వెర్షన్‌కు ఆమోదం తెలిపింది రష్యా. ఈమేరకు ఓ ప్రకటన చేశారు డెవలపర్లు. స్పుత్నిక్ లైట్ పేరుతో కొత్త వెర్షన్‌ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. 80శాతం సామర్థ్యాన్ని కలిగి ఉండే ఈ వ్యాక్సిన్.. ఫిబ్రవరిలో ప్రచురించిన ఫలితాల ప్రకారం,  91.6% సామర్థ్యాన్ని చూపించింది. స్పుత్నిక్ లైట్ ఒక్క డోసు వేసుకుంటే చాలు ప్రభావవంతంగా పనిచేస్తుంవని నిపుణులు చెబుతున్నారు.

2020 డిసెంబర్ 5వ తేదీ నుంచి 2021 ఏప్రిల్ 15వ తేదీ మధ్య రష్యా జరిపిన పరిశోధనల్లో వచ్చిన ఫలితాలు ఆధారంగా ఈ స్పుత్నిక్-వి ఫలితాలు ప్రకటించారు. ఇంజెక్షన్ ఇచ్చిన 28 రోజుల్లో తీసుకున్న డేటా ద్వారా వీటి ప్రభావాన్ని ప్రకటించినట్లు అక్కడి నిపుణులు చెబుతున్నారు.

“కరోనావైరస్ కొత్త జాతులపై కూడా స్పుత్నిక్ లైట్ సమర్థవంతంగా నిరూపించబడింది” అని పరిశోధకులు ఒక ప్రకటనలో తెలిపింది. “స్పుత్నిక్ లైట్‌ వేసుకున్న తర్వాత తీవ్రమైన ప్రతికూల సంఘటనలు కూడా ఏమీ నమోదు కాలేదు.” అని చెబుతున్నారు.

“ప్రపంచవ్యాప్తంగా స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ ధర $10 కంటే తక్కువగా ఉంటుంది [సుమారు 730 రూపాయలు], దీనికి సాధారణ నిల్వ అవసరాలు ఉన్నాయి, + 2- + 8 [డిగ్రీల సెల్సియస్] వద్ద, ఇది సులభమైన లాజిస్టిక్స్ కోసం అందిస్తుంది,” అని డెవలపర్లు వెల్లడించారు. స్పుత్నిక్ వ్యాక్సిన్లను గమలేయ నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసింది.

రోగనిరోధక శక్తి పెంచడం ద్వారా కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి స్పుత్నిక్ లైట్ సహాయపడుతుంది. సీరం ఇన్స్టిట్యూట్ తీసుకుని వచ్చిన కోవిషీల్డ్ మరియు భారత్ బయోటెక్ కోవాక్సిన్ తరువాత భారతదేశంలో అత్యవసర వినియోగ అధికారాన్ని పొందిన మూడవ టీకా స్పుత్నిక్V.

ఇప్పటికే రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాలు హైదరాబాద్‌ చేరుకున్నాయి. తొలి విడతలో 1.5 లక్షల డోసులను మాస్కో నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు. భారత్లో స్పుత్నిక్‌-వి టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించిన డాక్టర్‌ రెడ్డీస్ ‌ల్యాబ్‌ సంస్థ వీటిని దిగుమతి చేసుకుంది.