Toll Free: యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం.. టోల్ ఫ్రీ నంబర్ ఇదే!

యుక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

Toll Free: యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం.. టోల్ ఫ్రీ నంబర్ ఇదే!

Toll Free

Toll Free: యుక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. యుక్రెయిన్, దాని సరిహద్దు సమీపంలో వందలాది మంది విద్యార్థులతో సహా సుమారు 20 వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఈ క్రమంలో అప్రమత్తమైన భారత్ ప్రభుత్వం.. యుక్రెయిన్‌లో చిక్కుకున్నవారిని తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాలను నడుపుతోంది. యుక్రెయిన్ సంక్షోభం తీవ్రమైన క్రమంలో ఎప్పుడైనా యుద్ధం జరగవచ్చు అంటున్నారు.

ఈ క్రమంలో యుక్రెయిన్, దాని పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో నివసిస్తున్న భారతీయ పౌరులను.. వందలాది మంది విద్యార్థులతో సహా భారత పౌరులకు సెక్యురిటీ విషయంలో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే వెంటనే భారతీయ పౌరులను తీసుకురావడానికి ఎయిర్ ఇండియా చొరవ తీసుకుంది.

యుక్రెయిన్ నుంచి భారతీయ పౌరులను తీసుకురావడానికి ప్రత్యేక విమానాలు:
యుక్రెయిన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా, భారత్ అదనపు విమానాలను నడపాలని నిర్ణయించింది. యుక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకారం.. ఫిబ్రవరి 25, ఫిబ్రవరి 27, మార్చి 6, 2022 తేదీలలో కైవ్ నుండి ఢిల్లీకి నాలుగు విమానాలు నడపనున్నారు. ఇది కాకుండా, బోరిస్పిల్ విమానాశ్రయం నుంచి ఫిబ్రవరి 22, 24, 26 తేదీల్లో భారతదేశానికి విమానాలను నడపాలని నిర్ణయించారు. భారత పౌరులను తీసుకురావడానికి ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం ఫిబ్రవరి 22న యుక్రెయిన్ చేరుకుంది. బుకింగ్ ఆఫీసులు, ట్రావెల్ ఏజెంట్ల టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే భారత్ యుక్రెయిన్‌లో నివసిస్తోన్న వారి కోసం హెల్ప్‌లైన్, టోల్ ఫ్రీ నంబర్‌లను ఏర్పాటు చేసింది. యుక్రెయిన్‌లో చిక్కుకున్న వ్యక్తి, లేదా బంధువు, స్నేహితుడు ఎవరైనా భారత ప్రభుత్వం జారీ చేసిన హెల్ప్‌లైన్ నంబర్ లేదా టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చు. విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) యుక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేసింది. ఈ కంట్రోల్ రూమ్ 24 గంటల హెల్ప్‌లైన్‌ అందుబాటులో ఉంచింది.