Russia – Ukraine : పసిడి ప్రియులకు షాక్, త్వరలో 10 గ్రాములు రూ. 55 వేలు?

యుక్రెయన్ పై రష్యా యుద్ధానికి దిగితే...ఈ దేశంపై ఇతర దేశాలు వాణిజ్యపరమైన ఆంక్షలు విధించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ఫలితంగా...

Russia – Ukraine : పసిడి ప్రియులకు షాక్, త్వరలో 10 గ్రాములు రూ. 55 వేలు?

Gold Price Today

Gold Prices May High : బంగారమంటే భారతీయులకు ఎంత మక్కువో చెప్పనక్కర్లేదు. ధరలు స్వల్పంగా తగ్గినా..వెంటనే కొనడానికి ఆసక్తి చూపుతుంటారు. ఎంతో కొంత బంగారాన్ని కొనాలని, ధరలు ఎంతున్నాయో ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. మహిళల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవరం లేదు. కానీ..త్వరలోనే వీటి ధరలు పైకి ఎగబాకుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు కారణమని అంటున్నారు. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 55 వేలు మార్కు దాటుతుందని, రష్యా – యుక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ధరల పెరుగుదలకు కారణమౌతున్నాయంటున్నారు. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు.. డాలర్ తో పోలిస్తే రూపాయి మారక విలువ పడిపోవడం, అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి ధర పెరుగుదల తదితర పరిణామాలు దేశీయ మార్కెట్ పసిడి, వెండి ధరలు పెరిగేలా చేస్తున్నాయని వెల్లడిస్తున్నారు.

Read More : Today Gold Prices : మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గుతున్న బంగారం.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ బంగారం 1,900 డాలర్లకు చేరుకుంది. అలాగే వెండి 24 డాలర్లకు పెరిగిపోయింది. ఈ ఒక్కకారణమే కాకుండా.. డాలర్ తో పోలిస్తే… రూపాయి మారక విలువ కూడా పడిపోయింది. ఇప్పటికే బంగారం ధర రూ. 50 వేల మార్క్ ను అధిగమించింది. పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 50 వేల 123గా ఉంది. స్వల్పకాలిక దిద్దుబాటుకు లోనైనా..మళ్లీ ర్యాలీ తీయనున్నాయని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వడ్డీ రేట్లను పలు దశల్లో పెంచనున్నట్లు ఫెడ్ రిజర్వ్ ప్రకటించడంతో ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి.

Read More : Gold Seized : శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారం సీజ్

రష్యా – యుక్రెయిన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారేలా కనబడడం లేదు. ఏ క్షణం యుద్ధం ముంచుకొస్తుందోనని భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఈ ఉద్రిక్తతలు పలు రంగాలపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. యుక్రెయన్ పై రష్యా యుద్ధానికి దిగితే…ఈ దేశంపై ఇతర దేశాలు వాణిజ్యపరమైన ఆంక్షలు విధించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్ కు రష్యా నుంచి బంగారంతో పాటు పలు లోహాల సరఫరా పడిపోవచ్చనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఈ పరిస్థితుల కారణంగా… బంగారం, వెండి ధరలకు రెక్కలు వస్తాయని భావిస్తున్నారు.