ప్రేమ గుడ్డిది..పెంచిన కొడుకును పెళ్లాడిన Star

ప్రేమ గుడ్డిది..పెంచిన కొడుకును పెళ్లాడిన Star

ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలుసా ? తెలియదు. తక్కువ వయస్సున్న వారిని పెళ్లాడుతారు. ఇతర దేశాలకు చెందిన వారిని వివాహమాడుతారు. కానీ…ఓ వ్యక్తి తన తల్లినే పెళ్లి చేసేసుకున్నాడు. గిదేం…పని రా బాబు..అనుకుంటున్నారా..

అతనికి జన్మనిచ్చిన తల్లి కాదు..పెంచిన తల్లి..ఈ ఘటన రష్యాలో చోటు చేసుకుంది. ఆ తల్లి..సోషల్ మీడియా స్టార్ కావడంతో వెలుగులోకి వచ్చింది.

రష్యాలో 35 ఏళ్ల మెరీనా బల్మషేవ సోషల్ మీడియా స్టార్. ఇన్ స్ట్రాగ్రామ్ లో 4 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అలెక్స్ అరే అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఐదుగురు పిల్లలను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. ఇలా పది సంవత్సరాలు గడిచిపోయాయి. వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి.

విడాకుల వరకు వెళ్లారు. కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. పిల్లల బాధ్యత మాత్రం తండ్రికే అప్పచెప్పింది కోర్టు. ఈ క్రమంలో 20 ఏళ్ల కొడుకు వ్లాదిమర్ వోయా పెంచిన తల్లితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరి మనస్సులు ఒక్కటయ్యాయి. పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేసుకున్నారు.

వీరికి కరోనా అడ్డు పడింది. దీంతో పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఎట్టకేలకు గత వారం వీరు..రిజిష్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో దీనికి సంబంధించిన వార్త, ఫొటోలు, వీడియోలు రచ్చ రచ్చ చేస్తున్నాయి.

పెంచుకున్న కొడుకుతో పెళ్లి ఏంటీ అని తిట్టుకోవచ్చు..కొంతమంది సపోర్టు చేయవచ్చు..కానీ..ఏదైమైనా నా ఇష్టం అంటూ చెబుతోందంట..ఇంకో విషయం..ప్రస్తుతం ఆమె గర్భవతి అని టాక్.