Russia’s Sputnik V: వచ్చే వారం నుండి భారత్ మార్కెట్లోకి స్పుత్నిక్ వ్యాక్సిన్

Russia’s Sputnik V: వచ్చే వారం నుండి భారత్ మార్కెట్లోకి స్పుత్నిక్ వ్యాక్సిన్

Russias Sputnik V

స్పుత్నిక్ వి వ్యాక్సిన్ భారతదేశానికి వచ్చిందని దేశంలో కరోనా వైరస్, వ్యాక్సిన్ పరిస్థితిపై నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్ ప్రకటించారు. స్పుత్నిక్ వ్యాక్సిన్ అమ్మకం వచ్చే వారం నుండి భారతదేశంలో ప్రారంభమవుతుందని చెప్పుకొచ్చారు.

వచ్చే ఐదు నెలల్లో 2 బిలియన్ మోతాదులు భారతదేశంలో లభిస్తాయని పాల్ చెప్పారు. దేశీయ మరియు విదేశీ టీకాలు భారతదేశంలో ప్రవేశపెట్టినట్లు చెప్పిన పాల్.. అక్టోబర్ నాటికి స్పూత్నిక్ భారతదేశంలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని వెల్లడించారు.

ఎఫ్‌డిఎ, డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదించిన ఏదైనా వ్యాక్సిన్ భారత్‌కు రావచ్చని డాక్టర్ పాల్ చెప్పారు. 1-2 రోజుల్లో దిగుమతి లైసెన్స్ ఇవ్వబడుతుందని, వారి సంస్థలతో ఇక్కడ తయారు చేసేందుకు మేము వారిని ఆహ్వానిస్తున్నాము అని పాల్ చెప్పారు.

ప్రపంచంలోని మొట్టమొదటి వ్యాక్సిన్‌గా భావిస్తున్న స్పుత్నిక్-వీ టీకా స్థానిక ఉత్పత్తిలో దాదాపు 15.6 కోట్ల మోతాదులను తయారు చేయవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రష్యాకు చెందిన గమలేయ నేషనల్ సెంటర్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ టీకాను హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ భారత్‌లో తయారు చేస్తుంది.

ప్రతి కంపెనీకి వ్యాక్సిన్ చేయగల సామర్థ్యం లేదని, అలా చేయాలనుకునే సంస్థలకు మేము బహిరంగ ఆహ్వానం అందిస్తున్నట్లు చెప్పారు. కొవాగ్జిన్ తయారు చేయాలనుకునే కంపెనీల సామర్థ్యం పెరిగేలా ప్రభుత్వం సహాయం చేస్తుందని ఆయన అన్నారు.

కొవాగ్జిన్ తయారీని ఇతర సంస్థలకు ఇవ్వాలని ప్రజలు అడుగుతున్నారని డాక్టర్ పాల్ అన్నారు. ఇదే విషయాన్ని మేము భారత్ బయోటెక్‌తో చర్చించినప్పుడు, సంస్థ స్వాగతించిందని అన్నారు.