Sabarimala: తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం.. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు

ధర్మశాస్త, మణికంఠుడు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం నెలవారీ పూజల కోసం జులై 17వ తేదీన తెరుచుకోనుంది.

Sabarimala: తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం.. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు

Ayyappa

Swamiye Saranam Ayyappa: ధర్మశాస్త, మణికంఠుడు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం నెలవారీ పూజల కోసం జులై 17వ తేదీన తెరుచుకోనుంది. హిందువుల ప్రధాన క్షేత్రాలలో ఒకటైన హరిహర సుతుడు అయ్యప్ప దేవాలయం కేరళలోని శబరిమలై నాలుగు రోజుల పాటు జులై 21వ తేదీ వరకు భక్తుల దర్శనం కోసం అందుబాటులో ఉండనుంది. అయితే, కరోనా కారణంగా కేవలం 5వేల మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు దేవస్థానం నిర్వాహకులు.

ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు.. కోవిడ్ టీకా వేసుకున్నట్టు సర్టిఫికెట్, ఆర్‌టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు తీసుకుని వస్తే అనుమతి ఉంటుందని స్పష్టంచేసింది. దర్శనానికి వచ్చే 48 నుంచి 72 గంటల ముందు చేయించుకున్న పరీక్షను పరిగణనలోకి తీసుకోనున్నారు.

ఆన్‌లైన్‌‌లో ముందుగానే టికెట్లు బుక్‌ చేసుకుని వచ్చేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు దేవస్థానం నిర్వాహకులు. 5 వేల మందికి మాత్రమే దర్శనానికి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు శబరిమల వస్తుంది. సముద్ర మట్టానికి 3వేల అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు, 18 కొండల మధ్య క్షేత్రం ఉంటుంది.

మాములుగా అయితే, మండల పూజ(నవంబరు), మకరవిళక్కు(జనవరి) మధ్యలో దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు శబరిమలకు వస్తుంటారు. కానీ, కరోనా కారణంగా గతేడాది నుంచి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతి ఇస్తుండగా.. ఇప్పుడు మాత్రం జులై 17న సాయంత్రం ఆలయాన్ని తెరిచి, ప్రత్యేక పూజల అనంతరం దర్శనానికి అనుమతిస్తారు.