Rajasthan Politics: అశోక్ గెహ్లాట్‭తో చేతులు కలిపినప్పటికీ ఆ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్న సచిన్ పైలట్

కలిసికట్టుగానే ఎన్నికల ప్రచారం చేసేందుకు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ అంగీకరించారు. సోమవారం ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్ గాంధీలు ఈ ఇరు నేతలతో ప్రత్యేకంగా సమావేశమై ఈ ఒప్పందాన్ని కుదిర్చారు

Rajasthan Politics: అశోక్ గెహ్లాట్‭తో చేతులు కలిపినప్పటికీ ఆ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్న సచిన్ పైలట్

Sachin Pilot

Sachin Pilot: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మద్య కొనసాగుతున్న కోల్డ్ వారుకు తాజాగా ముగింపు పలికేందుకు కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలించలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి గెహ్లాట్‭తో కలిసి పని చేసేందుకు పైలట్ ఒప్పుకున్నప్పటికీ.. తాను చాలా కాలంగా ఆరోపిస్తున్న ప్రభుత్వ అవినీతిపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారు. వాస్తవనానికి గెహ్లాట్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని పైలట్ అనడం లేదు.

Karnataka Politics: కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన సునీల్ కనుగోలుకు భారీ బహుమతే ఇచ్చిన సీఎం సిద్ధరామయ్య

కాకపోతే, వసుంధర రాజే ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై గెహ్లాట్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, రాజేకు గెహ్లాట్‮‭కు మధ్య ఈ విషయమై గట్టి ఒప్పందం ఉందని ఆరోపిస్తున్నారు. దీనిపై ఆయన రాష్ట్రంలో పాదయాత్ర, ఒకరోజు నిరాహార దీక్ష లాంటివి చేశారు. ఇక ప్రభుత్వ నియామకాల్లో జరిగిన అవకతవకలపై కూడా చర్యలు తీసుకోవడం లేదని పైలట్ ఆరోపిస్తున్నారు. గెహ్లాట్ సైతం ఇదే స్థాయిలో ప్రతిదాడి చేస్తున్నారు. పదవులు తనకేం కొత్త కాదని, తాను మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యానని, కానీ కొందరు పదవుల కోసం ఎంతకైనా తెగిస్తారంటూ పైలట్‭ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Elon Musk: మళ్లీ నెంబర్ వన్ స్థానానికి ఎగబాకిన ఎలాన్ మస్క్.. ఆ దెబ్బతో రెండో స్థానంలోకి అర్నాల్ట్

ఇక కలిసికట్టుగానే ఎన్నికల ప్రచారం చేసేందుకు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ అంగీకరించారు. సోమవారం ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్ గాంధీలు ఈ ఇరు నేతలతో ప్రత్యేకంగా సమావేశమై ఈ ఒప్పందాన్ని కుదిర్చారు. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలు సహా, ఇతర కుమ్ములాటలను నివారించేందుకే ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశం సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. నాలుగు గంటల పాటు సాగిన చర్చల అనంతరం ఎట్టకేలకు చేతులు కలిపేందుకు పైలట్, గెహ్లాట్ సరే అన్నారు.