Coronavirus : బ్రేకింగ్ న్యూస్..సచిన్ టెండూల్కర్ కు కరోనా

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనా బారిన పడ్డాడు. తాజాగా చేయించుకున్న పరీక్షలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Coronavirus : బ్రేకింగ్ న్యూస్..సచిన్ టెండూల్కర్ కు కరోనా

Sachin Tendulkar Tests Positive For Coronavirus

Sachin Tendulkar : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనా బారిన పడ్డాడు. తాజాగా చేయించుకున్న పరీక్షలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనకు కరోనా సోకినట్లు సచిన్‌ ప్రకటించాడు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించాడు. కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ… ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నా అంటూ సచిన్‌ ట్వీట్‌ చేశాడు. అయితే తాజాగా చేయించుకున్న పరీక్షలో తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నాడు. కరోనా లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నాయని చెప్పాడు మాస్టర్‌. తన ఇంట్లో మిగిలిన అందరికీ నెగిటివ్ వచ్చిందన్నాడు. తాను ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నానంటూ ట్వీట్‌ చేశాడు. తనకు మద్దతుగా నిలుస్తున్న వైద్య సిబ్బందికి, దేశవ్యాప్తంగా ఉన్న శ్రేయోభిలాషులకు సచిన్‌ ధన్యవాదాలు తెలిపాడు.

మరోవైపు భారతదేశంలో..సెకండ్ వేవ్‌లో కరోనా చెడుగుడు ఆడుతోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 62 వేల కేసులు నమోదయ్యాయి. గతేడాది అక్టోబర్ 16 తర్వాత ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దేశంలో కొత్తగా 62వేల 258 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. మొత్తం 291 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4 లక్షల 52 వేల 647కు చేరుకుంది.

కరోనా రికవరీ రేటు 95 శాతం కంటే ఎక్కువగానే ఉన్నా… కొత్త కేసులు కూడా అదే స్థాయిలో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 160 రోజుల తర్వాత తొలిసారిగా భారీ స్థాయిలో కేసుల పెరుగుదల కనిపిస్తోంది. అత్యధికంగా కేసులు నమోదవుతున్న దేశాల్లో ప్రస్తుతం భారత్ మూడో స్థాయిలో ఉంది. మహారాష్ట్ర, పంజాబ్, మధ్య ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక , కేరళ, ఢిల్లీలో కేసుల పెరుగుదల ఎక్కువగా ఉంది.