PF ఖాతా ఉందా? ఉచితంగానే రూ.7 లక్షలు పొందొచ్చు.. ఎలాగంటే..

మీకు పీఎఫ్ ఖాతా ఉందా? అయితే మీకో గుడ్ న్యూస్. మీరు ఉచితంగానే రూ.7లక్షల వరకు ఇన్సూరెన్స్ ప్రయోజనం పొందొచ్చు. ఒక్క దరఖాస్తు నింపితే చాలు.. రూ.7 లక్షల వరకు

PF ఖాతా ఉందా? ఉచితంగానే రూ.7 లక్షలు పొందొచ్చు.. ఎలాగంటే..

Epfo Account

EPFO Account : మీకు పీఎఫ్ ఖాతా ఉందా? అయితే మీకో గుడ్ న్యూస్. మీరు ఉచితంగానే రూ.7లక్షల వరకు ఇన్సూరెన్స్ ప్రయోజనం పొందొచ్చు. ఒక్క దరఖాస్తు నింపితే చాలు.. రూ.7 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది. అదెలాగంటే..

ఈపీఎఫ్‌లో ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్(EDLI) స్కీమ్ ఉందనే విషయం చాలామందికి తెలియుదు. ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగుల కుటుంబానికి రూ.7 లక్షల వరకు ప్రయోజనం అందుతుంది. ఇది పూర్తిగా ఇన్సూరెన్స్ స్కీమ్. పీఎఫ్ అకౌంట్ ఉన్న ఉద్యోగులంతా ఈ స్కీమ్‌కు అర్హులే. పీఎఫ్ అకౌంట్ కొగుతున్న క్రమంలో ఆ ఉద్యోగి మరణిస్తే.. కుటుంబసభ్యులకు రూ.7 లక్షల బీమా అందుతుంది.

Black Grapes : బరువును తగ్గించి రోగ నిరోధక శక్తి పెంచే నల్ల ద్రాక్ష

ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్‌ ప్రయోజనం పొందాలటే సంబంధిత ఉద్యోగులు తప్పనిసరిగా ఇ నామినేషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అంటే నామినీ వివరాల్ని ఈపీఎఫ్ అక్కౌంట్‌లో నమోదు చేయాలి. ఆన్‌లైన్‌లోనే సులభంగా నామినీ వివరాలను ఎంటర్ చేయవచ్చు. ఈపీఎఫ్ సభ్యులంతా ఇ నామినేషన్ ఫైల్ చేసి కుటుంబసభ్యులకు సామాజిక భద్రత కల్పించాలని ఈపీఎఫ్ఓ కోరుతోంది.

దీని గురించి సోషల్ మీడియా ద్వారా ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు అవగాహన కల్పిస్తోంది ఈపీఎఫ్ఓ. ఆన్‌లైన్‌లోనే ఇ-నామినేషన్ ఫైల్ చేసే సదుపాయాన్ని కూడా కల్పించింది. ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో కేవలం ఐదు నిమిషాల్లో ఇ-నామినేషన్ ఫైల్ చేయొచ్చు. అయితే యూఏఎన్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేసి ఉండాలి. ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ పనిచేస్తూ ఉండాలి. మీ ఇ-నామినేషన్ ఈపీఎఫ్ఓ దగ్గర రిజిస్టర్ అవుతుంది.
మరి ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో ఇ-నామినేషన్ ఎలా ఫైల్ చేయాలో తెలుసుకోండి..

* ఈపీఎఫ్ పోర్టల్(https://www.epfindia.gov.in/) ఓపెన్ చేయాలి.
* హోమ్ పేజీలో Service ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
* ఫర్ ఎంప్లాయిస్ సెక్షన్ క్లిక్ చేయాలి.
* Member UAN/Online Service ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
* యూఏఎన్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
* ఆ తరువాత Manage ట్యాబ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది.
* ఇందులో E Nomination సెలెక్ట్ చేయాలి.
* ఫ్యామిలీ డిక్లరేషన్ ఆప్షన్ దగ్గర Yes ఆప్షన్ సెలెక్ట్ చేయాలి
* Add Family Details క్లిక్ చేసి అవసరమైన వివరాలు ఎంటర్ చేయాలి. నామినీగా ఒకరికన్నా ఎక్కువ మంది పేర్లు ఇవ్వొచ్చు.
* ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో కూడా చెప్పవచ్చు.
* చివరిగా వివరాలను సరిచూసుకున్న తరువాత Save EPF Nominationపై క్లిక్ చేయాలి.
* ఆ తరువాత పేజీలో E Sign ఆప్షన్ క్లిక్ చేయాలి.
* మీ ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
* ఓటీపీ ఎంటర్ చేశాక నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

Pills : గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా?..దుష్పప్రభావాలు ఇవే..

పీఎఫ్ సబ్‌స్క్రైబర్లు ప్రమాదం, అనారోగ్యం కారణంగా మరణిస్తే.. అప్పుడు వారి కుటుంబాలకు ఈ పీఎఫ్ ఇన్సూరెన్స్ డబ్బులు లభిస్తాయి. పీఎఫ్ అకౌంట్ నామినీకి డబ్బులు వస్తాయి. నామినీ ఎవ్వరూ లేకపోతే భాగస్వామి లేదా పిల్లలకు ఈ డబ్బులు లభిస్తాయి. కరోనా వల్ల చనిపోయినా కూడా ఈ డబ్బులు వస్తాయి.

బేసిక్ శాలరీ, డీఏ‌కు 35 రెట్లు ఈ ఇన్సూరెన్స్ లభిస్తుంది. అలాగే బోనస్ కింద గరిష్టంగా రూ.1.75 లక్షల వరకు పొందొచ్చు. ఉదాహరణకు బేసిక్, డీఏ రూ.15 వేలు అనుకుంటే.. అప్పుడు ఇన్సూరెన్స్ కింద రూ.5.25 లక్షలు, బోనస్ రూ.1.75 లక్షలు మొత్తంగా రూ.7 లక్షల వరకు లభిస్తాయి.

కాగా, గతంలో ఈ ఇన్సూరెన్స్ కవర్ గరిష్టంగా రూ.6 లక్షలుగా ఉండేది. కానీ ఇప్పుడు రూ.7 లక్షల వరకు లభిస్తాయి. కేంద్రం ఇటీవలనే ఇన్సూరెన్స్ కవరేజ్ పెంచింది. కనీసం రూ.2 లక్షల 50 వేలు, గరిష్టంగా రూ.7 లక్షలు అందనున్నాయి.