లూజ్‌ సిగరేట్లు, బీడీల అమ్మకాలపై నిషేధం !

  • Published By: madhu ,Published On : November 2, 2020 / 04:36 PM IST
లూజ్‌ సిగరేట్లు, బీడీల అమ్మకాలపై నిషేధం !

Sale of loose cigarettes, beedis likely to be banned In Delhi : వదులుగా సిగరేట్లు, బీడీల అమ్మకాలపై నిషేధం విధించాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు ఈ విషయంపై చర్చిస్తున్నారని ప్రభుత్వ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.



ఆరోగ్యానికి హాని కలిగించే వీటిని కట్టడి చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. Sub-section 2 of Section 7 సిగరేట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై తగిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమౌతోందని సమాచారం. కానీ..దీనిని నిరోధించడం కొంత కష్టమేనంటున్నారు అధికారులు. లూజ్ గా పొగాకు ఉత్పత్తులు కొనుగోలు చేసే వ్యక్తులు ప్యాకెట్లపై ఉన్న చిత్రాలను, హెచ్చరికలను చూడలేకపోతారని తెలిపారు.



సిగరేట్లను తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయో అందరికీ తెలిసిందే. క్యాన్సర్, హృదయ సంబంధిత వ్యాధులతో బాధ పడుతుంటారు. సిగరేట్లు, పొగాకు ఉత్పత్తులపై హెచ్చరికలు చూపించే మెరుగైన చిత్రాలను తప్పనిసరి చేసింది. మరి ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.