Salman Khurshid’s House : కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు

కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపై కొందరు దుండగులు దాడి చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనీతాల్​లోని సల్మాన్ ఖుర్షీద్ ఇంటిని ధ్వంసం చేసి, నిప్పంటించారు దుండగులు.

Salman Khurshid’s House :  కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు

Salman

కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపై కొందరు దుండగులు దాడి చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనీతాల్​లోని సల్మాన్ ఖుర్షీద్ ఇంటిని ధ్వంసం చేసి, నిప్పంటించారు దుండగులు. దీంతో ప్రధాన ద్వారం తలుపు కాలిపోయింది. ఒక వీడియోలో.. సల్మాన్ ఖుర్షీద్‌ ఇంటి డోర్‌కు నిప్పుపెట్టిన వ్యక్తులు బీజేపీ జెండాలు పట్టుకోవడంతోపాటు జై శ్రీరామ్‌, హర హర మహాదేవ్ అంటూ నినాదాలు చేశారు.

కాగా, సల్మాన్ ఖుర్షీద్‌ టీవల రాసిన ‘సన్​రైజ్ ఓవర్ అయోధ్య- నేషన్​హుడ్ ఇన్​ అవర్ టైమ్స్​’ పుస్తకం ఈ దాడికి కారణంగా తెలుస్తోంది. అయోధ్య తీర్పుపై ఆయన రాసిన పుస్తకంలో హిందుత్వాన్ని ఉగ్రవాదంతో పోల్చారు. దీనిపై వివాదం చెలరేగింది. హిందువుల మనోభావాలను కించపరిచేలా ఈ పుస్తకం రాశారని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

తన ఇంటిపై దాడి విషయాన్ని సల్మాన్ ఖుర్షీద్ స్వయంగా ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు. తన ఇంటి ధ్వంసానికి సంబంచిన ఫొటోలు, వీడియోలను అందులో పోస్ట్‌ చేశారు. ఇది హిందూమతం కాదని నేను ఇప్పటికీ తప్పుగా చెప్పానా?’ అని ప్రశ్నించారు. “ఇప్పుడు అలాంటి చర్చ జరుగుతోంది. కాబట్టి సిగ్గు అనేది చాలా పనికిమాలిన పదం. అంగీకరించినా, అంగీకరించకపోయినా ఏదో ఒక రోజు మనమంతా కలిసి దీనిపై తర్కించగలమని నేను ఇప్పటికీ ఆశిస్తున్నాను” అని ఖుర్షీద్ అందులో పేర్కొన్నారు.

ALSO READ Breast Milk : కోవిడ్ సోకిన,వ్యాక్సిన్ తీసుకున్న తల్లి పాలలో కోవిడ్ యాంటీబాడీలు