Uttar pradesh: 62మందితో ఎస్పీ జాతీయ కార్యవర్గం ప్రకటన.. శివపాల్ యాదవ్‌కు కీలక బాధ్యతలు
సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. మొత్తం 62మంది సభ్యులతో కూడిన జాబితాతో పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాలో ఫోస్టు చేసింది.

Uttar pradesh: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. మొత్తం 62మంది సభ్యులతో కూడిన జాబితాతో పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాలో ఫోస్టు చేసింది. మొత్తం 62మందిలో 14మంది జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ఉంటారు. గతకొంతకాలం వివాదాలతో దూరమైన మామ శివపాల్ యాదవ్‌కు ఈ కమిటీలో ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పెద్దబాధ్యతే అప్పగించారు. 14మంది జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో శివపాల్ యాదవ్ కూడా ఉన్నారు.
Akhilesh Yadav: ఈసారి ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదా? ఎస్పీ చీఫ్ అఖిలేష్ జోస్యం ఏంటంటే..?
2016లో అఖిలేష్ యాదవ్, శివపాల్ యాదవ్ విబేధాల కారణంగా విడిపోయారు. వీరిద్దరు మేనమామ- మేనల్లుడు. గతేడాది డిసెంబర్‌లో సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణంతో కలిసిన వీరు, గత ఏడాది డిసెంబర్ జరిగిన మెయిన్‌పురిలో లోక్‌సభ ఉప ఎన్నికల సందర్భంగా ఒక్కటయిన విషయం విధితమే. ఈ క్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శుల జాబితాలో శివపాల్ యాదవ్ కు చోటుదక్కింది. శివపాల్‌తో పాటు మహ్మద్ ఆజం ఖాన్, స్వామి ప్రసాద్ మౌర్య, రవి ప్రకాష్ వర్మ, బలరామ్ యాదవ్, తదితరులు ఉన్నారు.
समाजवादी पार्टी की राष्ट्रीय कार्यकारिणी के नवनिर्वाचित/मनोनीत पदाधिकारियों व सदस्यों की सूची। pic.twitter.com/Bs7YrfrAvN
— Samajwadi Party (@samajwadiparty) January 29, 2023
జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్ యాదవ్ కొనసాగుతుండగా, జాతీయ ఉపాధ్యక్షుడిగా కిరణ్మోయ్ నందా, జాతీయ ప్రధాన ప్రధాన కార్యదర్శిగా రామ్ గోపాల్ యాదవ్ కొనసాగుతున్నారు. పార్టీ కోశాధికారిగా సుదీప్ రంజన్ సేన్, సభ్యులతో పాటు 19మంది జాతీయ కార్యదర్శులు ఉంటారు.