Mulayam Singh Yadav “Critical”: ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమం: వైద్యులు

కొన్ని వారాలుగా ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్(82) ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు బులిటెన్ లో తెలిపారు. ఆయనకు హరియాణాలోని గురుగ్రామ్ లో మెదంతా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఆయనను వైద్య నిపుణులు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ సమాజ్ వాదీ పార్టీ ట్వీట్ చేసింది.

Mulayam Singh Yadav “Critical”: ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమం: వైద్యులు

Mulayam Singh Yadav “Critical”: కొన్ని వారాలుగా ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్(82) ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు బులిటెన్ లో తెలిపారు. ఆయనకు హరియాణాలోని గురుగ్రామ్ లో మెదంతా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఆయనను వైద్య నిపుణులు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ సమాజ్ వాదీ పార్టీ ట్వీట్ చేసింది.

ములాయం సింగ్ యాదవ్ జీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. కాగా, ములాయం సింగ్‌ యాదవ్‌ కొన్ని వారాలుగా మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఆయన ఆరోగ్యం క్షీణించిడంతో ఐసీయూ వార్డులో చేర్చారు. రెండు రోజుల క్రితమే సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేశ్ యాదవ్‌ వెంటనే యూపీ నుంచి బయలుదేరి మెదంతా ఆసుపత్రికి చేరుకుని తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కాగా, ములాయం సింగ్ యాదవ్ యూపీ సీఎంగా మూడుసార్లు పనిచేశారు. భారత రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. గత కొన్ని ఏళ్లుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..