Nawab Malik: సమీర్ వాంఖడే ధరించిన చొక్కా ఖరీదు రూ.70 వేలు: నవాబ్ మాలిక్‌

బాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో మహారాష్ట్ర నేతల మధ్య వార్ నడుస్తోంది. ఒకరిపై మరొకరు సవాళ్లను విసురుకుంటున్నారు. NCB జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖేడేపై మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు.

Nawab Malik: సమీర్ వాంఖడే ధరించిన చొక్కా ఖరీదు రూ.70 వేలు: నవాబ్ మాలిక్‌

Sameer Wankhede Wore Rs 70,000 Shirt Nawab Malik

Nawab Malik : బాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో మహారాష్ట్ర నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై మరొకరు సవాళ్లను విసురుకుంటున్నారు. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై ఆ రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ (Nawab Malik) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఫడ్నవీస్ ఆరోపణలపై మాలిక్ కౌంటర్ ఇచ్చారు. తనకు అండర్ వరల్డ్ తో లింకులు ఉన్నాయని ఆరోపణలు చేశారు.. గత 62ఏళ్లుగా ఈ సిటీలో నివసిస్తున్నాను.. నా మీద వేలెత్తి చూపే ముందు.. నాకు అండర్ వరల్డ్‌తో సంబంధాలున్నాయని చెప్పే ధైర్యం ఎవరికీలేదన్నారు. ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా పనిచేశారు. అప్పట్లో హోం మంత్రిత్వ శాఖ ఆయన దగ్గరే ఉంది. ఆయన అప్పుడే ఎందుకు విచారణ జరపలేదో చెప్పాలని మాలిక్ సూటిగా ప్రశ్నించారు.

డ్రగ్స్ కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి NCB జోనల్ (Narcotics Control Bureau) డైరెక్టర్ సమీర్ వాంఖడేపై మాలిక్ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ జోనల్ డైరెక్టర్ కోట్లు సంపాదించారని, నిజాయతీ పరుడైన అధికారికి సాధ్యంకానిరీతిలో ఖరీదైన వస్తువుల్ని వాడుతున్నారని ఆరోపణలు చేశారు. సమీర్ వాంఖడే ధరించే ట్రౌజర్ రూ.లక్ష విలువ ఉంటుందని, రూ.70 వేల విలువైన చొక్కా, 25 నుంచి 30 లక్షల విలువైన చేతి గడియారాలు ధరించారని అన్నారు. నిజాయతీ గల అధికారి అయితే విలువైన వస్తువుల్ని ఎలా కొనుగోలరో చెప్పాలన్నారు.
Read Also : Badvel Election : సీఎం జగన్ మెజార్టీని క్రాస్ చేసిన డా.సుధ

అక్రమంగా కొందరిని కేసుల్లో ఇరికించి ఇలా కోట్లు సంపాదించారంటూ ఆరోపణలు చేశారు. ఇలాంటి పనులు చేసేందుకు వాంఖడేకు ప్రైవేటుగా వ్యక్తులున్నారని మాల్విక్ తీవ్ర ఆరోపణలు చేశారు. మాలిక్ ఆరోపణలను సమీర్ తీవ్రంగా ఖండించారు. నేను ధరించిన ఖరీదైన దుస్తుల గురించి వస్తున్న వార్తలు పుకార్లు మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు. ఆయా వస్తువుల గురించి ఆయనకు అవగాహన లేకపోవచ్చునని అన్నారు. వాస్తవాలు తెలుసుకుని ఒకరిపై ఆరోపణలు చేయాలనిఅన్నారు. డ్రగ్ మాఫియా తమ అధికారుల్ని, తన కుటుంబాన్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయినప్పటినుంచి సమీర్ వాంఖడేపై మాలిక్ ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మాట్లాడుతూ.. మాపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని, అయినప్పటికీ తాము మర్యాద తప్పలేదన్నారు. మాలిక్ ఆరోపణలపై దీపావళి తర్వాత గట్టి సమాధానం చెప్తానని స్పష్టం చేశారు. అండర్ వరల్డ్‌లో తనకు ఉన్న సంబంధాల్ని కూడా బట్టబయలు చేస్తానని తెలిపారు.
Read Also : Maharashtra : మనీ ల్యాండరింగ్ కేసులో మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్