Samsung Galaxy A52s 5G : ఇండియాలో లాంచ్ డేట్ ఫిక్స్.. అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతంటే..

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ ఇటీవలే తన గెలాక్సీ A52s 5జీ స్మార్ట్ ఫోన్‌ను యూరప్‌లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఏ52 5జీకి తర్వాతి

Samsung Galaxy A52s 5G : ఇండియాలో లాంచ్ డేట్ ఫిక్స్.. అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతంటే..

Samsung Galaxy A52s 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ అధునాతన ఫీచర్లతో ఇటీవలే తన గెలాక్సీ A52s 5జీ స్మార్ట్ ఫోన్‌ను యూరప్‌లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఏ52 5జీకి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్‌ను శాంసంగ్ లాంచ్ చేసింది. ఇక ఇండియాలో కూడా ఈ ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్ డేట్ ఫిక్స్ అయ్యింది. సెప్టెంబర్ 1న భారత్ లో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. ఈ మేరకు సౌత్ కొరియన్ స్మార్ట్ ఫోన్ తయారీదారు అధికారికంగా ప్రకటన చేసింది.

సెప్టెంబ‌ర్ 1న మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఈ ఫోన్‌ను ఇండియ‌న్ మార్కెట్‌లో విడుద‌ల చేయ‌నుంది సామ్‌సంగ్‌. ఈ ఫోన్ రిలీజ్‌కు సంబంధించి.. సామ్‌సంగ్ ఇండియా ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ షేర్ చేసింది.

అంతేకాదు అమెజాన్ ఇండియా వెబ్ సైట్ లో Samsung Galaxy A52s 5G లిస్టింగ్ అయ్యింది. Samsung Galaxy A52s 5G ఇదివరకే గ్లోబల్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు భారత కస్టమర్లకు కూడా అందుబాటులోకి రానుంది.

భారత్ లో Samsung Galaxy A52s ధర..
అమెజాన్ లిస్టింగ్ ప్రకారం..
* Samsung Galaxy A52s 6GB RAM, 128GB storage వేరియంట్ ధర Rs 35,999(డిస్కౌంట్ తర్వాత).
* 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,499.
* అసమ్ బ్లాక్, అసమ్ వైట్, అసమ్ వయొలెట్, అసమ్ మింట్ కలర్స్ లో అందుబాటులోకి…
* ఈ ఫోన్ యూరప్‌లో కేవలం ఒక్క వేరియంట్‌లో మాత్రమే లాంచ్ అయింది.
* 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 409 పౌండ్లుగా(సుమారు రూ.40,800) నిర్ణయించారు.
* మన దేశంలో రెండు వేరియంట్లలో విడుదల(6 జీబీ ప్ల‌స్ 128 జీబీ వేరియంట్‌, 8 జీబీ ప్ల‌స్ 128 జీబీ వేరియంట్)

శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్పెసిఫికేషన్లు
* ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది.
* 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ ఇన్‌ఫినిటీ-ఓ డిస్ ప్లే.
* దీని రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది.
* క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 778జీ ఎస్ఓసీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.

* 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
* దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం
* బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా
* 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
* 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో అందించారు.
* దీని మందం 0.84 సెంటీమీటర్లుగానూ, బరువు 189 గ్రాములుగానూ ఉంది.

* వెనకవైపు నాలుగు కెమెరాలు.
* వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌
* దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్
* 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్
* 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్
* ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించనున్నారు.