shells Ganesh : 7000 గవ్వలతో గణనాథుడు..సైకత శిల్పి అద్భుత సృష్టి

వినాయక చవివి పర్వదినం సందర్భంగా గణనాథులు కొలువుదీరారు. చాక్లెట్ వినాయకుడు, కరోనా వాక్సిన్ గణేషుడు ఆకట్టుకుంటున్నారు. అలాగే 7000 గవ్వలతో తయారు చేసిన గణనాథుదు ఆకట్టుకుంటున్నాడు.

shells Ganesh : 7000 గవ్వలతో గణనాథుడు..సైకత శిల్పి అద్భుత సృష్టి

Shells Ganesh Idol With 7000 Sea Shells (1)

shells Ganesh idol with 7000 sea shells : సుదర్శన్ పట్నాయక్. ఈయన పేరు వింటే కళ కళ్లముందు కదలాడుతుంది.ఇసుకతో అత్యద్భుతమైన చిత్రాలు మనస్సుల్ని కదిలిస్తాయి. సుదర్శన్ పట్నాక్ తీర్చిదిద్దే ఇసుక కళాఖండాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. పర్యావరణాన్ని గుర్తు చేస్తాయి. ప్రకృతిని కాపాడండీ ఆ ప్రకృతే మనల్ని కాపాడుతుందనే సందేశాన్నిస్తాయి. అటువంటి గొప్ప చిత్రకారుడి చేతిలోంచి రూపుదిద్దుకున్నాడు ‘గవ్వల గణనాధుడు’.7000 సముద్రపు గవ్వలతో గణనాధుడిని తీర్చిదిద్దాడు ఒడిశాకు చెందిన సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్.

Read more :Chocolate Ganesh : తియ్యతియ్యని 200 కేజీల చాక్లెట్ వినాయకుడు

ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ వినాయక చవితి సందర్భంగా 7000 సముద్రపు గవ్వలతో వినాయకుడిని తయారు చేశాడు. ఒడిశాలోని పూరీ బీచ్ లో సుదర్శన్ వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశాడు. ఈ గవ్వల గణనాథుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు.పర్యావరణ హితమైన పండుగ చేసుకోవాలని పిలుపునిస్తున్నాడు.

Read more : Ganesh Chaturthi 2021: వినాయక చవితి సందర్భంగా ఆ గణపతికి రూ.6కోట్ల విలువైన కిరీటం

ఇప్పటి వరకూ ఎన్నో రకాలు చిత్రాలను ఇసుకతో రూపొందించాను…మొదటి సారి 7000 గవ్వలను ఉపయోగించి బీచ్ లో వినాయకుడి విగ్రహాన్ని నిర్మించాను. వరల్డ్ పీస్ అనే నినాదంతో ఈ గవ్వల గణపతిని నిర్మించాను అని తెలిపారు. ఇది ప్రపంచంలోనే మొదటి సముద్రపు గవ్వలు, ఇసుకను కలిపి తయారు చేసిన వినాయకుడి విగ్రహం అనుకుంట.. అని సుదర్శన్ పట్నాయక్ తన ట్వీట్ లోతెలిపారు. సుదర్శన్ పట్నాయక్ టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. గవ్వల గణపతి భలే ఉన్నాడే అంటు తెగ మెచ్చేసుకుంటున్నారు.

Read more :Punjab Govt: వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగులకు బలవంతపు సెలవులు!

Read more : Vaccine Vinayaka : వ్యాక్సిన్ వినాయకుడు..టీకా వేయించుకుంటేనే రమ్మంటున్నాడు..