పార్లమెంట్‌కు ఉపేంద్ర : 2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ

  • Published By: venkaiahnaidu ,Published On : January 27, 2019 / 07:01 AM IST
పార్లమెంట్‌కు ఉపేంద్ర : 2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ

2019 లో జరగబోయే జనరల్ ఎలక్షన్స్‌లో తమ పార్టీ కూడా పోటీ చేయబోతుందని కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తెలిపారు. కర్ణాటకలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాల్లో తన నాయకత్వంలోని ఉత్తమ ప్రజాకీయ పార్టీ(UPP) పోటీ చేయనుందని శనివారం(జనవరి 26,2019) ఉపేంద్ర ప్రకటించారు. తమ పార్టీకి ఎన్నికల కమిషన్ కేటాయించిన ఆటోరిక్షా గుర్తుపై తమ అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. తాను కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.

 

2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కర్ణాటక ప్రజ్ణవంతర జనతా పార్టీ(KPJP) తరఫున పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ కొన్ని పరిస్థితుల కారణంగా తాము ఆ ఎన్నికల్లో పోటీ చేయకలేకపోయినట్లు ఆయన తెలిపారు. అభ్యర్ధుల ఎంపిక విషయంలో పార్టీ వ్యవస్థాపకుడు, ఉపేంద్రకు మధ్య వచ్చిన విభేధాల కారణంగా ఉపేంద్ర ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. 

 

అయితే ఈ సారి మాత్రం తము సొంతంగా పార్టీ పెట్టుకున్నామని ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అభ్యర్థుల ఎంపికపై ప్రస్తుతం తాను దృష్టి పెట్టినట్లు తెలిపారు. 15-20 రోజుల్లో అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిపారు. ప్రజల యొక్క, ప్రజల కోసం, ప్రజల చేత అనే నినాదంతో తాము ప్రచారం చేస్తామని తెలిపారు. వాస్తవికత మేనిఫెస్టోలను మాత్రమే తమ పార్టీ అంగీకరిస్తుందని తెలిపారు. ఏ పార్టీతో తాము పొత్తు పెట్టుకోమని, బంటరిగానే బరిలోకి దిగుతామని ఉపేంద్ర సృష్టం చేశారు.

 

ఈ సందర్భంగా నటుడు ప్రకాష్ రాజ్ పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన ఉపేంద్ర.. ప్రకాష్ రాజ్ తాను పోటీ చేయనున్న బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి ప్రజానుకూల మేనిఫెస్టోతో ముందుకొస్తే తప్పకుండా తమ పార్టీ అతనికి మద్దతిస్తుందని ఉపేంద్ర సృష్టం చేశారు.