Sangana Basava Swami : ప్రవచనాలు చెబుతూనే ప్రాణాలు వదిలిన పీఠాధిపతి
ప్రవచనాలు చెబుతూనే ఓ పీఠాధిపతి ప్రాణాలు వదిలారు. కర్నాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. బలోబల మఠం పీఠాధిపతి శ్రీసంగన బసవ మహా స్వామీజీ(54)

Sangana Basava Swami : ప్రవచనాలు చెబుతూనే ఓ పీఠాధిపతి ప్రాణాలు వదిలారు. కర్నాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. బలోబల మఠం పీఠాధిపతి శ్రీసంగన బసవ మహా స్వామీజీ(54) ప్రసంగిస్తూనే స్టేజ్ పైనే ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 6న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తన పుట్టిన రోజు వేడుకల సందర్భంగా పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులను ఉద్దేశించి స్వామీజీ ప్రసంగిస్తున్నారు.
ఆ సమయంలో హఠాత్తుగా గుండెపోటు రాగా ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కుర్చీలోనే కన్నుమూశారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా షాక్ కి గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే పీఠాధిపతి కన్నుమూశారు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
CBI : చైల్డ్ పోర్న్ రాకెట్‌పై సీబీఐ మెరుపు దాడి
స్వామిజీ ప్రవచనాలు చెబుతున్నారు. వేదిక మీద ఉన్న వారు, భక్తులు అంతా శ్రద్దగా వింటున్నారు. ప్రవచనాలు చెబుతున్న స్వామీజీ ఒక్కసారిగా కుర్చీలోనే కుప్పకూలారు. దీంతో అక్కడ అలజడి రేగింది. స్వామీజీకి ఏమైందో తెలియక అంతా కంగారుపడ్డారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే ఆయన చనిపోయారని డాక్టర్లు చెప్పారు. గుండెపోటుతో స్వామీజీ కన్నుమూశారని డాక్టర్లు తెలిపారు. తన పుట్టిన రోజు నాడే స్వామీజీ తుది శ్వాస విడిచారు. సంగనబసవ స్వామి బాలాబోల మఠానికి చెందిన వారు. బవసయోగ్ మండప్ ట్రస్ట్ పెద్దగా ఉన్నారు. నవంబర్ 6న ఆయన 53వ పుట్టిన రోజు. ఆ సందర్భంగా ప్రవచనాలు ఇస్తూ కన్నుమూశారు.
प्रवचन देते स्वामी की हार्ट अटैक से मौत, वीडियो आया सामने #HeartAttack #Death
अन्य Videos यहां देखें – https://t.co/ZoADfwSi4S pic.twitter.com/fT5aDH60Ne
— Zee News (@ZeeNews) November 16, 2021
- Musa Yamak : షాకింగ్.. గుండెపోటుతో రింగ్‌లోనే కన్నుమూసిన దిగ్గజ బాక్సర్.. ఇప్పటివరకు ఓటమన్నదే ఎరుగడు
- Karnataka : PSI పోస్టుల భర్తీలో అక్రమాలు..న్యాయం చేయకపోతే నక్సల్స్‌లో చేరుతామని ప్రధానికి రక్తంతో లేఖ రాసిన అభ్యర్థులు
- Honey Trap : హనీట్రాప్ వల్లే బీజేపీ నాయకుడి ఆత్మహత్య ?
- Bengaluru : సన్యాసి వేషంలో నిందితుడు-పారిపోతుండగా కాలిపై కాల్చిన పోలీసులు
- Divya Spandana: నేను ఏ తప్పు చేయలేదు.. మాజీ ఎంపీ రమ్య ఆవేదన
1VVS Laxman: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
2Ola S1 Pro: మరో వివాదంలో ఓలా స్కూటర్.. వినియోగదారుడి ట్వీట్
3CM KCR Karnataka tour: రేపు బెంగళూరుకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
4TSRTC : హైదరాబాద్‌లో అర్ధరాత్రి పూట కూడా సిటీ బస్సు సర్వీసులు
5Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో 46 మంది అరెస్ట్-తానేటి వనిత
6Adipurush: మరోసారి నిరాశపరిచిన ఆదిపురుష్
7Bypoll Schedule: ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో అసెంబ్లీ స్థానానికి కూడా
8Raviteja: మరో సినిమాకు రవితేజ పచ్చజెండా..?
9RSS Founder: పాఠంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడి స్పీచ్.. వ్యతిరేకంగా నిరసనలు
10World Shortest: ప్రపంచంలో అత్యంత పొట్టి వ్యక్తికి గిన్నీస్ రికార్డ్
-
BJP Supremacy: దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం: పార్టీ ఉన్నత స్థాయి సమావేశం
-
Dark Circles : ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయ్!
-
Hair Whitening : జుట్టు తెల్లబడటానికి కారణాలు, నివారణకు సూచనలు
-
Modi in Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు
-
Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!
-
Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్ను ఫిక్స్ చేసిన అనిల్..?
-
Anemia : రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా లండన్ వెళ్లారు: విదేశీ వ్యవహారాలశాఖ