5 ఏళ్ల చిన్నారి..తలకిందులుగా వేలాడుతూ…111 బాణాలు..13 నిమిషాల 15 సెకండ్లు

  • Published By: madhu ,Published On : August 18, 2020 / 11:59 AM IST
5 ఏళ్ల చిన్నారి..తలకిందులుగా వేలాడుతూ…111 బాణాలు..13 నిమిషాల 15 సెకండ్లు

ఒకటి కాదు..రెండు కాదు..5 ఏళ్ళ చిన్నారి సంజన తలకిందులుగా వేలాడుతూ.. 13 నిమిషాల 15 సెకండ్లలో 111 బాణాలు సంధించింది. ఆగస్టు 15వ తేదీన ఈ ఫీట్ చేసి వావ్ అనిపించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం ఈ ప్రయత్నం చేసింది.



కాంటినెంటల్ జడ్జ్ ఆఫ్ వరల్డ్ ఆర్చరీ అధ్యక్షతన ఏర్పడిన జడ్జీల ప్యానెల్… ఈవెంట్‌ను పర్యవేక్షించింది. భారత ఆర్చరీ అసోసియేష్ ఆఫ్ ఇండియా (AAI) సెక్రెటరీ జనరల్ ప్రమోద్ చందూర్కర్, ఢిల్లీ ఆర్చరీ అసోసియేష్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్‌దేవ హాజరయ్యారు. అలాగే.. AAI జడ్జెస్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ జోరిస్ ఈవెంట్‌ని ఆన్‌లైన్‌లో చూశారు.





ఆర్చరీ పోటీల్లో ఆరు బాణాలను 4 నిమిషాల్లో సంధిస్తారు. 20 నిమిషాలకు 30 బాణాల కింద లెక్క వస్తుందని చెప్పారు సంజనకు ట్రైనింగ్ ఇచ్చిన హుస్సేని. తన స్టూడెంట్ సాధించిన రికార్డును గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వారు పరిశీలిస్తారని తెలిపారు. తన ఐదేళ్ల కూతురు సాధించిన ఫీట్ తో తండ్రి ప్రేమ్ సంతోషం వ్యక్తం చేశారు.



తన చిట్టి తల్లి సాధించినది చూసి… తండ్రి ప్రేమ్… ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డే రోజున ఇలాంటి ఫీట్స్ చేస్తుందని, 2032 ఒలింపిక్స్ కు ట్రైనింగ్ ఇప్పిస్తానంటున్నాడు.