బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సై అన్న శివసేన

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సై అన్న శివసేన

Sanjay Raut మరికొద్ది నెలల్లో జరుగనున్న వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన కూడా పోటీ చేస్తున్నట్లు ఆదివారం(జనవరి-17,2020) ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు. పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రేతో చర్చల తర్వాత వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని శివసేన నిర్ణయించిందని..త్వరలోనే తాము కోల్ కతాకి చేరుకుంటామని సంజయ్ రౌత్ తెలిపారు.

కాగా, ఓ వైపు ఇప్పటికే బెంగాల్ లో తృణముల్ కాంగ్రెస్-బీజేపీ మధ్య ప్రచారహోరు తారాస్థాయికి చేరకున్న సమయంలో ఇప్పుడు బెంగాల్ లో శివసేన ఎంట్రీ ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. బీజేపీ టార్గెట్ గా ఎన్నికల సమరంలో శివసేన కత్తులు దూసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బెంగాల్ లో హిందుత్వ ఎజెండాతో బీజేపీ ఓట్లు చీల్చడమే శివసేన లక్ష్యంగా కనిపిస్తోంది.

అయితే మమతపై కూడా శివసేన తరచుగా విమర్శలు గుప్పిస్తూనే ఉంటుంది. మైనార్టీలకు అనుకూల పాలసీలు వంటి విషయాల్లో మమతపై శివసేన విమర్శలు గుప్పిస్తూనే ఉంది. ఏదిఏమైనప్పటికీ బెంగాల్ లో శివసేన ఎంట్రీ..మమతకి కలిస్తుందా లేక బీజేపీకే కలిసొస్తుందా అని తెలియాలంటే మరికొద్ది ఆగాల్సిందే.