అందంగా ముస్తాబై : అగ్నిగుండలో నడిచిన గోమాతలు 

  • Published By: veegamteam ,Published On : January 17, 2019 / 05:16 AM IST
అందంగా ముస్తాబై : అగ్నిగుండలో నడిచిన గోమాతలు 

సంక్రాంతి వేడుకలు
రైతన్నలకు,సంక్రాంతిలకు, గోవులు, బసవలన్నలకు విడదీయరాని బంధం
ఎద్దులకు, ఆవులకు అలకరణ
అగ్నిగుండంలో బసవన్నలు, గోమాతలు
బెంగళూరులో సంక్రాంతి వేడుకలు

బెంగళూరు : సంక్రాంతి పండుగకు గోమాతలకు విడదీయరాని అనుబంధం వుంది. రైతలన్నలకు శిరిసంపదలనిచ్చే ఆవులు..నాగలి దున్ని పొలంలో శిరులు పండించే బసవన్నలు..ఆ పంట శిరి ఇంటికి వచ్చే తొలి పండుగ మకర సంక్రాంతి. ఈ వేడుకను పురస్కరించుకుని గోమాతలకు, బసవలన్నలను అందంగా అలకరించి..పూజించటం సంక్రాంతి పండుగలో వస్తున్న ఆనవాయితీ. ఈ క్రమంలో మకర సంక్రాంతి రోజున అగ్ని గుండంలో గోవులు నడిచిన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. సిరిసంపదలు ఇంటికి వచ్చే శుభసందర్భాన నిర్వహించుకునే ఈ పండుగ సందర్భంగా బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమం అందరినీ ఆకర్షించింది.

 గోవుల మెడలో దండలు వేసి, గంటలు కట్టి అందంగా అలంకరించిన తర్వాత వాటితో కలిసి యజమానులు మంటల్లో నడిచారు. అగ్నికీలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతుండగా వాటి మధ్యలోంచి గోవులు పరుగులు తీశాయి. వాటి యజమానులు కూడా వాటితోపాటు మంటల్లో నడిచారు. పదుల సంఖ్యలో గోవులు ఈ మంటల్లోంచి పరుగులు తీయగా వేడుకను చూసేందుకు జనాలు పోటెత్తారు. సంక్రాంతి రోజున గోమాతను మంటల్లో నడిపించడం ఓ ఆచారమని కార్యక్రమమ నిర్వాహకులు తెలిపారు.