Sara Ali Khan : కోట్లు సంపాదించావు… బిచ్చగత్తెకు ఇచ్చేది పది రూపాయలేనా? ప్రముఖ నటిపై దారుణమైన ట్రోలింగ్

సోషల్ మీడియా పుణ్యమా అని.. సెలబ్రిటీలు ఏం చేసినా ఇట్టే వైరల్ అయిపోతోంది. మంచి పని చేస్తే నెటిజన్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అదే ఏదైనా కాని పని చేశారో ఇక అంతే సంగతులు.

Sara Ali Khan : కోట్లు సంపాదించావు… బిచ్చగత్తెకు ఇచ్చేది పది రూపాయలేనా? ప్రముఖ నటిపై దారుణమైన ట్రోలింగ్

Sara Ali Khan

Sara Ali Khan : సోషల్ మీడియా పుణ్యమా అని.. సెలబ్రిటీలు ఏం చేసినా ఇట్టే వైరల్ అయిపోతోంది. మంచి పని చేస్తే నెటిజన్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అదే ఏదైనా కాని పని చేశారో ఇక అంతే సంగతులు. అడ్డంగా బుక్కైపోతారు. నెటిజన్లు చెడుగుడు ఆడుకుంటారు. ట్రోలింగ్ తో పిచ్చెక్కిస్తారు. ఇటీవలి కాలంలో ట్రోలింగ్ పేరిట సెలబ్రిటీలను ఏకిపారేయడం కామన్ గా మారింది. తాజాగా బాలీవుడ్ నటి సారా అలీఖాన్ కు ఇదే సమస్య ఎదురైంది.

Bra : వార్నీ.. పిచ్చ కామెడీ.. సాక్స్ ఆర్డర్ చేస్తే బ్రా వచ్చింది..

ముంబయిలో తన తల్లి అమృతా సింగ్, సోదరుడు ఇబ్రహీం అలీఖాన్ తో కలిసి ఓ రెస్టారెంట్ లో భోజనం చేసిన తర్వాత కారులో ఎక్కేందుకు సారా బయటికి వచ్చింది. ఇంతలో ఓ బిచ్చగత్తె చేయి చాచింది. దాంతో సారా ఆమెకు ఓ బిస్కట్ ప్యాకెట్ ఇచ్చింది. అయినప్పటికీ ఆ బిచ్చగత్తె వెళ్లకపోవడంతో ఓ పది రూపాయల నోటు ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ వీడియో నేపథ్యంలో నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. సారాను ట్రోలింగ్ చేస్తున్నారు.

Free Wi-Fi: ఉచిత వైఫై వాడుతున్నారా? రిస్క్ చేస్తున్నట్లే.. తస్మాత్ జాగ్రత్త!!

“కోట్లు సంపాదించావు… బిచ్చగత్తెకు పది రూపాయలే ఇస్తావా?” అంటూ కొందరు నెటిజన్లు విరుచుకుపడ్డారు. “పాపం, సారా వద్ద పది రూపాయలే ఉన్నాయి!” అంటూ మరికొందరు, “మా మిడిల్ క్లాసోళ్లం నయం… బిచ్చగాళ్లకు మీకంటే ఎక్కువే ఇస్తాం!” అంటూ ఇంకొందరు స్పందించారు. ఇలా అనే రకాల వ్యాఖ్యలతో సారా అలీఖాన్ ను విమర్శించారు.

అదే సమయంలో సారాను సమర్థించే వాళ్లూ లేకపోలేదు. అందులో ఆమె చేసిన తప్పేమీ లేదన్నారు. ఆ సమయానికి ఆమెకి చేతికి అందిన డబ్బుని ఇచ్చిందని, కావాలని ఆమె అలా చేయలేదని వివరణ ఇచ్చారు. సారాను ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదన్నారు. ఈ విషయాన్ని అనవసరంగా కొందరు పనిగట్టుకుని మరీ రాద్దాంతం చేస్తున్నారని సారా అభిమానులు మండిపడ్డారు.