Indian Saree : రెస్టారెంట్‌‌లోకి చీరతో వస్తే..నో ఎంట్రీ….వీడియో వైరల్

చీరలు ధరించిన మహిళలను అక్విలా రెస్టారెంట్ లోకి అనుమతించరని, చీర ఇప్పుడు స్మార్ట్ డ్రెస్ కాదంటా వెల్లడించారు.

Indian Saree : రెస్టారెంట్‌‌లోకి చీరతో వస్తే..నో ఎంట్రీ….వీడియో వైరల్

Saree

Aquila Restaurant : మహిళలు చీరలు ధరించడం సంప్రదాయం. విదేశీయులు కూడా చీర కట్టుపై మక్కువ చూపిస్తుంటారు. అంతేకాదు..వాళ్లు కూడా చీరను కట్టుకుని మురిసిపోతుంటారు. చీర కట్టుకుని వచ్చిన మహిళను రెస్టారెంట్ లోకి అనుమతించలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెస్టారెంట్ సిబ్బంది తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెస్టారెంట్ డ్రెస్ కోడ్ విధానంపై మండిపడుతున్నారు. ఇదొక వివక్ష అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ రెస్టారెంట్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.

Read More : Mamata Banerjee : భారత్ ని తాలిబన్ గా చేయడాన్ని అనుమతించం మోదీజీ

క్రాంతి మార్గంలో అక్విలా రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ కు ఓ మహిళ వచ్చింది. కానీ అక్కడున్న రెస్టారెంట్ సిబ్బంది లోనికి అనుమతించలేదు. డ్రెస్ కోడ్ ఉందని లోనికి రాకుండా అడ్డుకున్నారు. చీర ధరిస్తే..రెస్టారెంట్ లోనికి అనుమతించకూడదన్న నిబంధన ఎక్కడుందని అంటూ ప్రశ్నించారు ఆ మహిళ. స్మార్ట్ క్యాజువల్ డ్రెస్ లను మాత్రమే అనుమతినిస్తామని, చీర స్మార్ట్ క్యాజువల్ కిందకు రాదని సిబ్బంది చెప్పారు.

Read More : Rajasthan : యువకుడిని కొట్టారు..మూత్రం తాగించిన దంపతులు!

ఈ ఘటనపై జర్నలిస్టు అనితా చౌదరి ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియాలో వీడియోలను పోస్టు చేశారు. చీరలు ధరించిన మహిళలను అక్విలా రెస్టారెంట్ లోకి అనుమతించరని, చీర ఇప్పుడు స్మార్ట్ డ్రెస్ కాదంటా వెల్లడించారు. దయచేసి స్మార్ట్ దుస్తుల గురించి నిర్వచించాలని, అప్పుడు తాను చీర కట్టుకోవడం మానేస్తానంటూ..ఘాటుగా స్పందించారు. అంతేకాదు..పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ మహిళా కమిషన్ తో పాటు…పలువురిని ట్యాగ్ చేశారు.

తన తల్లి చీరల్ ఆల్ప్స్ పర్వంతపైకి ఎక్కారని, అక్కడ ఎవరూ అభ్యంతరం చెప్పలేదని ఓ యూజర్ తెలిపారు. చీరలో ఉన్న తల్లి ఫొటోను షేర్ చేశారు. అక్విలా రెస్టారెంట్ సిగ్గు పడాలని తెలిపారు. దీనిపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చీర స్మార్ట్ డ్రెస్ కాదని ఎవరు నిర్ణయించారంటూ..ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అమెరికా, బ్రిటన్, యూఏఈలోని ఉత్తమ రెస్టారెంట్లలో కూడా చీరలు ధరించినట్లు వెల్లడిస్తున్నారు.