Rakesh Tikait : సర్కారీ తాలిబన్ చేతుల్లో దేశం..రైతుల తలలు పగలకొట్టాలన్న అధికారిపై ఆగ్రహం

హర్యానా రాష్ట్రంలోని క‌ర్నాల్‌లో శ‌నివారం బీజేపీ నేతలకు వ్యతిరేకంగా ఆందోళ‌న చేస్తున్న రైతుల‌పై పోలీసులు లాఠీచార్జి చేయ‌డాన్ని భార‌తీయ కిసాన్ యూనియ‌న్ నేత రాకేష్ టికాయిత్

Rakesh Tikait : సర్కారీ తాలిబన్ చేతుల్లో దేశం..రైతుల తలలు పగలకొట్టాలన్న అధికారిపై ఆగ్రహం

Ias

హర్యానా రాష్ట్రంలోని క‌ర్నాల్‌లో శ‌నివారం బీజేపీ నేతలకు వ్యతిరేకంగా ఆందోళ‌న చేస్తున్న రైతుల‌పై పోలీసులు లాఠీచార్జి చేయ‌డాన్ని భార‌తీయ కిసాన్ యూనియ‌న్ నేత రాకేష్ టికాయిత్ తీవ్రంగా ఖండించారు. రైతుల‌పై లాఠీలు ఝ‌లిపించ‌డం చూస్తుంటే దేశం స‌ర్కారీ తాలిబ‌న్‌ల ఆధీనంలో ఉన్న‌ట్లు అనిపిస్తుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. రైతుల త‌ల‌లు ప‌గుల‌గొట్టాలంటూ కర్నాల్ సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్(SDM) ఆయుష్ సిన్హా పోలీసుల‌ను ఆదేశించ‌డం వినిపించింద‌ని, ఆ అధికారిని మావోయిస్టు ప్రాబ‌ల్య ప్రాంతానికి ట్రాన్స్‌ఫ‌ర్ చేయాల‌ని టికాయ‌త్ డిమాండ్ చేశారు.

ఆదివారం హర్యానాలోని “నుహ్” సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న టికాయత్ మాట్లాడుతూ…నిన్న ఒక పోలీస్ అధికారి రైతుల తలలు పగులగొట్టాలని ఆదేశించారు. వారు మమ్మల్ని ఖలిస్తానీ అని పిలుస్తారు. వారు మమ్మల్ని ఖలిస్తానీ,పాకిస్తానీ అంటే మేము కూడా సర్కారీ తాలిబన్ దేశాన్ని ఆక్రమించిందని అంటాం. వాళ్లు సర్కారీ తాలిబనీలు అని టికాయత్ పేర్కొన్నారు. రైతుల‌పై లాఠీచార్జి చేయించిన తీరును బ‌ట్టి హ‌ర్య‌ానా సీఎం మ‌నోహ‌ర్‌లాల్ క‌ట్ట‌ర్ జ‌న‌ర‌ల్ డ‌య్య‌ర్‌ను త‌ల‌పిస్తున్నార‌ని విమ‌ర్శించారు. అదేవిధంగా కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న భార‌తీయ జ‌న‌తాపార్టీకి జాతీయ‌జెండా అంటే గౌర‌వం లేద‌నిటికాయత్ మండిప‌డ్డారు. ఇటీవ‌ల‌ క‌ళ్యాణ్‌సింగ్ భౌతిక కాయంపై జాతీయ జెండాను క‌ప్పిన అనంత‌రం, బీజేపీ నేత‌లు దానిపై త‌మ పార్టీ జెండాను క‌ప్పార‌ని, జాతీయ జెండాపై వాళ్ల‌కు ఏపాటి గౌర‌వం ఉన్న‌దో దీన్నిబ‌ట్టే చెప్ప‌వ‌చ్చ‌ని అన్నారు.

అసలు శనివారం ఏం జరిగింది

కొద్ది నెలలుగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులు… శనివారం హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ ధనకర్ సహా ప్రముఖ నేతలు కర్నాల్‌లో జరిగే కార్యక్రమానికి హాజరుకాగా..వారిని అడ్డుకోవాలనే లక్ష్యంతో రైతు ఆందోళనకారులు రాస్తారోకో చేశారు. జాతీయ రహదారిని దిగ్బధించారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. రైతులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో పది మంది గాయపపడ్డారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో.. కర్నాల్ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (SDM) ఆయుష్ సిన్హా.. కొంతమంది పోలీసులకు సూచనలు చేస్తున్నారు. బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులు ఎవ్వరూ ఈ ప్రాంతంలో ఉండరాదని ఆదేశించారు. ఆయుశ్ సిన్హా… పోలీసుల గ్రూపు ముందు నిల్చుని ఒక హద్దును పేర్కొంటూ అది దాటి నిరసనకారులు రావడానికి వీల్లేదని స్పష్టం చేస్తున్నారు. సింపుల్.. వారెవరైనా, ఎక్కడివారైనా, ఎవ్వరూ అక్కడికి చేరడానికి వీల్లేదు. ఈ గీత దాటడానికి వీల్లేదు. ఎవరైనా ప్రయత్నిస్తే మీరు మీ లాఠీ తీయండి. గట్టిగా బాదండి. సరేనా? ఇందుకు ప్రత్యేకంగా మీకు సూచనలు ఇవ్వాల్సిన పనిలేదు. జస్ట్ వారిని చితక్కొట్టండి. ఒక్క నిరసనకారుడు అది దాటినట్టు కనిపించినా ఆయన తల గాయాలపాలై ఉండటాన్ని నేను చూడాలి. వారి తలలు పగులగొట్టండి అని సిన్హా పోలీసులకు సూచిస్తున్నట్టు వీడియోలో కనిపిస్తోంది. అంతేకాదు, చివరికి ‘ఎనీ డౌట్’ అని ఆయుష్ సిన్హా ప్రశ్నించగా ‘నో సర్’ అని గట్టిగా సమాధానమిచ్చారు పోలీసులు.

అయితే ఆయుష్ సిన్హా వైరల్ వీడియోపై బీజేపీ సహా అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా,ఇది ఎడిట్ చేసిన వీడియో అనే ఆశిస్తున్నానని బీజేపీ నేత వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. లేదంటే ప్రజాస్వామిక భారతంలో సొంత పౌరులపై ఇలాంటి చర్యలు ఎట్టిపరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని వివరించారు. కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా స్పందిస్తూ ‘ఖట్టార్ సాబ్, ఈ రోజు మీరు హర్యానా ప్రజల ఆత్మపై లాఠీ చార్జ్ చేశారు. వచ్చే తరాలు రోడ్లపై రైతుల రక్తపు మరకలను తప్పక గుర్తుంచుకుంటారు అని ట్వీట్ చేశారు.

పోలీసుల చర్యని సమర్థించిన సీఎం
కర్నాల్‌లో నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసు చర్యను హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సమర్థించారు. శనివారం సాయంత్రం కర్నాల్ లో రిపోర్టర్లతో ఖట్టర్ మాట్లాడుతూ.. తమ నిరసనలు శాంతియుతంగా ఉంటాయని గతంలో రైతులు హామీ ఇచ్చారని,కానీ పోలీసులపైకి రాళ్లు రువ్వబడ్డాయని మరియు హైవే బ్లాక్ చేయబడిందని..అందుకే లా అండ్ ఆర్డర్ ని మెయింటెయిన్ చేయడంలో భాగంగా పోలీసులు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కర్నాల్‌లో జరిగిన బీజేపీ సమావేశాన్ని ప్రస్తావిస్తూ.. ఇది పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశం అని మరియు దానిని వ్యతిరేకించడానికి వారు (రైతు సంఘాలు) ఇచ్చిన పిలుపును నేను ఖండిస్తున్నాను అని సీఎం పేర్కొన్నారు. ఏదైనా కారణంతో.. ఏదైనా సంస్థ యొక్క పనితీరును అడ్డుకోవడం ప్రజాస్వామ్య వ్యతిరేకం అని ఆయన అన్నారు.

READFarmers protest: సెప్టెంబర్ 25న భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన సంయుక్త కిసాన్ మోర్చా