నీరవ్ కేసులో ట్విస్ట్ : ఈడీ జాయింట్ డైరెక్టర్ బదిలీ

  • Published By: venkaiahnaidu ,Published On : March 29, 2019 / 12:26 PM IST
నీరవ్ కేసులో ట్విస్ట్ : ఈడీ జాయింట్ డైరెక్టర్ బదిలీ

ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ)జాయింట్ డైరక్టర్ సత్యబ్ర కుమార్ బదిలీ అయ్యారు.భారతీయ బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన నీరవ్ మోడీ కేసును దర్యాప్తు చేస్తున్న ఆయనను శుక్రవారం (మార్చి-29,2019)ఈడీ బదిలీ చేసింది.
Read Also : దేన్నీ వదలటం లేదు : రైల్వేలో టీ కప్పులపై మోడీ చౌకీదార్

ఇవాళ లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టులో నీరవ్ మోడీ రెండవ బెయిల్ అప్లికేషన్ పై వాదనలు ఉన్నందున సత్యబ్ర ప్రస్తుతం లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టులో ఉన్నాడు. ఈ సమయంలో ఆయనను ఈడీ బదిలీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.అంతేకాకుండా మరో ఆర్థికనేరగాడు విజయ్ మాల్యా కేసుని కూడా సత్యబ్ర దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.

సత్యబ్ర కుమార్ బదిలీ.. నీరవ్ కేసుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.పీఎన్ బీ స్కామ్ వెలుగులోకి వచ్చినప్పటినుంచి ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న సత్యబ్రను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది.ఇండియన్ రెవెన్యూ సర్వీస్(IRS) ఆఫీసర్ అయిన సత్యబ్ర కుమార్ మార్చి 2015లో ఈడీ జాయింట్ డైరక్టర్ గా ముంబై జోనల్ ఆఫీసులో జాయిన్ అయ్యారు. 

జాయింట్ డైరక్టర్ గా సత్యబ్ర ఐదేళ్ల పదవీకాలం ముగిసిన కారణంగానే ఆయనను బదిలీ చేయడం జరిగిందని ఈడీ ఓ లేఖను విడుదల చేసింది.MBZO-1లోని కోల్ బ్లాక్ కేసు దర్యాప్తుని సత్యబ్ర పర్యవేక్షిస్తాడని ఆ లేఖలో తెలిపింది.
 

Read Also : ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి : జియో టాప్ 5 డేటా ప్లాన్ ఆఫర్లు ఇవే