ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక.. వెంటనే ఆ పని చేయండి

ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక.. వెంటనే ఆ పని చేయండి

sbi alerts customers: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ(SBI) తన కస్టమర్లను హెచ్చరించింది. బ్యాంకు అకౌంట్ ను ఆధార్ నెంబర్ తో లింక్ చేయకుంటే ఇబ్బందులు తప్పవని చెప్పింది. ఆధార్ తో లింక్ చేసుకోకుంటే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, రావాల్సిన సబ్సిడీ ఖాతాలోకి రావని ఎస్బీఐ తేల్చి చెప్పింది. అంతేకాదు మనీ ట్రాన్సఫర్ కూడా కష్టమవుతుందని తెలిపింది. బ్యాంక్ ఖాతాని ఆధార్ తో అనుసంధానం చేయడం తప్పనిసరి అని చెప్పింది. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది ఎస్బీఐ.

బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ నెంబర్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా లింక్ చేసుకోవచ్చని ఎస్బీఐ తెలిపింది. ఆధార్ నెంబర్, బ్యాంక్ ఖాతాను అనుసంధానం చేసుకోవడానికి 4 ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయంది. ఎస్‌బీఐ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, బ్యాంక్ బ్రాంచ్‌ ద్వారా రెండింటినీ లింక్ చేసుకోవచ్చు. ఆధార్ జిరాక్స్, బ్యాంక్ పాస్ బుక్ తీసుకుని బ్రాంచ్ కి వెళితే సిబ్బంది ఈజీగా లింక్ చేస్తారని చెప్పింది. లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా లింక్ చేసుకోవచ్చంది.