SBI Charges : ఏటీఎంకు వెళితే బాదుడే.. జూలై 1 నుంచి కొత్త రూల్స్

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) బాదుడుకి సిద్ధమైంది. జూలై 1 నుంచి కొత్త రూల్స్ అమలు చేయనుంది.

SBI Charges : ఏటీఎంకు వెళితే బాదుడే.. జూలై 1 నుంచి కొత్త రూల్స్

Sbi New Charges

SBI New Charges : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) బాదుడుకి సిద్ధమైంది. జూలై 1 నుంచి కొత్త రూల్స్ అమలు చేయనుంది. దీని ప్రకారం కస్టమర్ల జేబుకి చిల్లు పడనుంది. బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులు నెలలో నాలుగు సార్లు మాత్రమే ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవచ్చు.

బ్రాంచీలలో డబ్బు డ్రా చేసేందుకు ఇదే రూల్ వర్తిస్తుంది. ఇక ఫ్రీ ట్రాన్సాక్షన్ లిమిట్ దాటితే రూ.15(ప్లస్ జీఎస్టీ) ఛార్జీ పడుతుంది. అటు సేవింగ్స్ అకౌంట్ కు 10 లీవ్స్ చెక్ బుక్ ఉచితం. ఆ తర్వాత 10 పేజీల బుక్ కు రూ.40, 25 పేజీల చెక్ బుక్ కు రూ.75, ఎమర్జెన్సీ చెక్ బుక్ కు రూ.50 చెల్లించాలి.

నగదు ఉపసంహరణకు ఎస్బీఐ సవరించిన ఛార్జీల వివరాలు:
ఎస్బీఐ బ్రాంచ్ లేదా ఏటీఎంలలో నగదు విత్‌డ్రా చేస్తే రూ.15తో అదనంగా జీఎస్టీ వసూలు చేస్తారు.
1) ఎస్‌బీఐ ఏటీఎంలు: రూ.15+GST
2) ఇతర బ్యాంకుల ఏటీఎంలు: రూ.15+GST

చెక్ బుక్ విషయంలో సవరించిన ఛార్జీల వివరాలు..
1) ఓ ఆర్థిక సంవత్సరంలో ఉపయోగించే మొదటి 10 చెక్కులకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు
2) ఆ తరువాత 10 లీవ్స్ చెక్ బుక్ కోసం రూ.40 + GST చెల్లించాలి
3) 25 లీవ్స్ చెక్ బుక్ కోసం రూ.75 + GST చెల్లించాలి
4) ఎమర్జెన్సీ చెక్ బుక్ కోసం రూ.50 + GST వసూలు చేస్తారు. సీనియర్ సిటిజన్లకు మినహాయింపు.

బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు బ్యాంక్ బ్రాంచులు, ఏటీఎం, సీడీఎంలలో ఎస్‌బీఐ ఇతర బ్యాంకులలో ఆర్థికేతర లావాదేవిలు పూర్తిగా ఉచితం. సొంత బ్రాంచులు, వేరే ఎస్‌బీఐ బ్యాంకులలో సేవింగ్స్ ఖాతా ఉన్నవారి నుంచి నగదు బదిలీ లావాదేవీలు చేయడానికి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు.