ఎస్బీఐ కస్టమర్లకు ముఖ్య గమనిక, ఏటీఎం రూల్స్‌లో మార్పులు, అలా చేస్తే బాదుడే

ఎస్బీఐ కస్టమర్లకు ముఖ్య గమనిక, ఏటీఎం రూల్స్‌లో మార్పులు, అలా చేస్తే బాదుడే

SBI ATM CASH WITHDRAWL RULES CHANGED: మీరు ఎస్బీఐ(SBI) కస్టమరా? మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే మీకు ఓ ముఖ్య గమనిక. ఎస్బీఐ ఏటీఎం(ATM) రూల్స్ మారాయి. ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రా(Cash withdraw) చేసే ముందు మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఉన్నాయి.

దేశీయ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఏటీఎం రూల్స్‌కు మార్పులు చేర్పులు చేసింది. ఇక‌పై అకౌంట్‌లో బ్యాలెన్స్ లేకుండా ఏటీఎంలో క్యాష్ విత్‌డ్రా చేస్తే ఆ ట్రాన్సాక్ష‌న్ ఫెయిల్ అయితే చార్జిల‌ను వ‌సూలు చేయ‌నుంది. అలా ఒక ట్రాన్సాక్ష‌న్‌కు రూ.20తోపాటు జీఎస్‌టీ అదనంగా క‌లిపి చార్జిల‌ను వ‌సూలు చేస్తారు. ఈ మేర‌కు ఈ కొత్త రూల్‌ను ఎస్‌బీఐ తాజాగా అమ‌లు చేస్తోంది.

ఇక నెల‌కు నిర్దేశించిన ఏటీఎం లావాదేవీలు పూర్తి అయితే ఆ తర్వాత చేసే ట్రాన్సాక్ష‌న్ల‌కు కూడా ఎస్‌బీఐ చార్జిల‌ను వ‌సూలు చేస్తుంది. ఫైనాన్షియ‌ల్‌, నాన్ ఫైనాన్షియ‌ల్ ట్రాన్సాక్ష‌న్ల‌కు ఆ చార్జిల‌ను వ‌సూలు చేస్తారు. అవి రూ.10 నుంచి రూ.20 మ‌ధ్య‌లో ఉంటాయి. వీటికి జీఎస్‌టీ అద‌నంగా చెల్లించాలి.

ప్ర‌స్తుతం ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్ క‌స్ట‌మ‌ర్ల‌కు మెట్రో సిటీల్లో నెల‌కు 8 ట్రాన్సాక్ష‌న్ల‌ను ఫ్రీగా ఇస్తున్నారు. అందులో 5 ట్రాన్సాక్షన్ల‌ను ఎస్‌బీఐ ఏటీఎంల‌లో, 3 ట్రాన్సాక్ష‌న్ల‌ను ఇత‌ర ఏటీఎంల‌లో ఉచితంగా చేసుకోవ‌చ్చు. నాన్ మెట్రో సిటీల్లో ఏటీఎం ట్రాన్సాక్ష‌న్ల ప‌రిమితి 10 గా ఉంది. వీటిల్లో ఎస్‌బీఐ ఏటీఎంల‌లో 5, ఇత‌ర ఏటీఎంల‌లో 5 ట్రాన్సాక్ష‌న్ల‌ను ఉచితంగా చేసుకోవ‌చ్చు. ఆ ప‌రిమితి దాటితే చార్జిల‌ను వ‌సూలు చేస్తారు.

ఓటీపీ మస్ట్:
ఇక రూ.10వేల‌కు మించి ఎస్‌బీఐ ఏటీఎంల‌లో తీయాలంటే అందుకు పిన్‌తోపాటు రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్‌కు వ‌చ్చే ఓటీపీని(OTP) కూడా క్యాష్ విత్‌డ్రా స‌మ‌యంలో ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది. ఈ సేవ‌ల‌ను ఉదయం 8 నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు ఎస్‌బీఐ అందిస్తోంది. కాబట్టి మీరు డబ్బు విత్ డ్రా చేసుకోవాలని అనుకున్నప్పుడు మీతో పాటు మీ మొబైల్ ని కూడా ఏటీఎంకి తీసుకెళ్లడం మర్చిపోకండి. ఈ కొత్త విధానాన్ని 2021 జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చారు.

అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకునే విధానం:
ఇక ఇంటర్ నెట్ అవసరం లేకుండానే ఎస్బీఐ కస్టమర్లు తమ అకౌంట్ లోని బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. అందుకు రెండు మార్గాలు ఉన్నాయి. కస్టమర్ తన రిజిస్టర్డ్ మొబైల్ నుంచి BAL అని టైప్ చేసి 92237 66666 కి ఎస్ఎంఎస్ పంపాలి. లేదా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 92237 66666 కి మిస్డ్ కాల్ కూడా ఇవ్వొచ్చు. ఈ నెంబర్ టోల్ ఫ్రీ. ఎలాంటి చార్జీలు పడవు. బ్యాలెన్స్ తెలుసుకోవడానికి ఏర్పాటు చేశారు.

ఎస్బీఐ తాజాగా చేసిన ఏటీఎం మార్పులతో కస్టమర్లకు ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి.. ఏటీఎం నుంచి మనీ విత్ డ్రా చేసే ముందు సరిపడా బ్యాలెన్స్ ఉందో లేదో ఖాతాదారులు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే జేబుకి చిల్లు పడటం ఖాయం.