SBI ఖాతాదారులకు అలర్ట్.. క్యాష్ విత్ డ్రాకు కొత్త రూల్

ఆన్ లైన్ మోసాలు పెరిగిపోయాయి. రెప్పపాటులో సైబర్ క్రిమినల్స్ డబ్బు దోచేస్తున్నాయి. దీంతో బ్యాంకులు ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు తీసుకొస్తున్నాయి. తాజాగా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ

SBI ఖాతాదారులకు అలర్ట్.. క్యాష్ విత్ డ్రాకు కొత్త రూల్

Sbi

SBI : ఆన్ లైన్ మోసాలు పెరిగిపోయాయి. రెప్పపాటులో సైబర్ క్రిమినల్స్ డబ్బు దోచేస్తున్నాయి. దీంతో బ్యాంకులు ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు తీసుకొస్తున్నాయి. తాజాగా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన వినియోగదారులు మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఏటీఎంలో జరిగే నేరాలను తగ్గించేందుకు కొత్త పద్ధతిని తీసుకొచ్చింది.

Sitting : ఎక్కువసేపు కూర్చునే ఉంటున్నారా..! గుండెజబ్బులు వచ్చే ఛాన్స్ అధికమే?

ఇకపై ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రా చేసుకునేందుకు ఓటీపీ తప్పనిసరి చేస్తూ ఎస్బీఐ నిబంధన తెచ్చింది. ఏటీఎం నుంచి నగదు తీసుకునేందుకు వన్ టైమ్ పాస్ వర్డ్ ప్రవేశపెట్టడం ద్వారా ఖాతాదారులు మోసకారుల చేతిలో పడకుండా సేఫ్ గా ఉంటారని ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఏటీఎంలో ఎప్పటిలాగే పిన్ ఎంటర్ చేశాక, ఖాతాదారుడి ఫోన్ కు ఓటీపీ వస్తుంది. అది కూడా ఎంటర్ చేస్తేనే నగదు తీసుకోవడం వీలవుతుంది. దీని ద్వారా ఖాతాదారుల ప్రయోజనాలు కాపాడొచ్చని బ్యాంకు భావిస్తోంది.

ఎస్బీఐ 2020లో ఓటీపీ ఆధారిత ఏటీఎం ట్రాన్షాక్షన్ విధానం తీసుకొచ్చింది. తాజాగా దీన్ని మరింత మెరుగుపరిచి ఓటీపీ ఆధారిత నగదు విత్ డ్రా విధానం ప్రవేశపెట్టింది. ఏటీఎం ద్వారా క్యాష్ తీసుకునే ఖాతాదారుడు బ్యాంకు ఖాతాతో నమోదు చేసుకున్న ఫోన్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తేనే నగదు వస్తుందని, లేదంటే నగదు తీసుకోలేరని ఎస్బీఐ తెలిపింది. ఆన్ లైన్ మోసగాళ్ల బారి నుంచి ఖాతాదారులను కాపాడేందుకు ఈ విధానం తీసుకొచ్చినట్లు ఎస్బీఐ తెలిపింది. కాగా, ఇది కేవలం ఎస్బీఐ ఖాతాదారులు, ఆ బ్యాంకుకి చెందిన ఏటీఎంల ద్వారా నగదు విత్ డ్రా చేసుకున్నప్పుడు మాత్రమే ఈ సేవలు అందుతాయి. ఇతర ఏటీఎం నుంచి క్యాష్ తీసుకుంటే ఓటీపీ నిబంధన వర్తించదు.

LPG Price: వారం రోజుల్లో మరో రూ.100 పెరగనున్న వంట గ్యాస్

“ఎస్‌బీఐ ఏటీఎంలలో లావాదేవీల కోసం మా ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ వ్యవస్థతో మోసగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుంది. మోసాల నుంచి మిమ్మల్ని రక్షించడం మా బాధ్యత” అని ఎస్బీఐ ట్వీట్ చేసింది.

అంటే, ఇక నుంచి క్యాష్ విత్ డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లే ముందు మీ ఫోన్ మీ దగ్గర ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఫోన్ లేకపోతే డబ్బు తీసుకోవడం కుదరదు మరి.