SBI e-Auction: ఎస్బీఐ ఈ వేలం తెలుసా.. ఆస్తులు కొనాలనుకుంటే ఇలా చేయండి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వేలం అక్టోబ‌రు 25న నిర్వహించనుంది. తమ వద్ద త‌న‌ఖా పెట్టిన ప‌లు వాణిజ్య‌, నివాస ఆస్తులను ఇందులో ఉంచుతారు.

SBI e-Auction: ఎస్బీఐ ఈ వేలం తెలుసా.. ఆస్తులు కొనాలనుకుంటే ఇలా చేయండి

Sbi Home Loan

SBI e-Auction: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వేలం అక్టోబ‌రు 25న నిర్వహించనుంది. తమ వద్ద త‌న‌ఖా పెట్టిన ప‌లు వాణిజ్య‌, నివాస ఆస్తులను ఇందులో ఉంచుతారు. ఈ వేలం ద్వారా మార్కెట్ ధ‌ర కంటే త‌క్కువ‌కే ఇల్లు, ఫ్లాట్లు, షాపుల‌ను బిడ్ వేసి గెలుచుకునే అవ‌కాశం కల్పిస్తున్నారు. ఆస్తుల‌ను సొంతం చేసుకోవాలనుకునేవారు ఇందులో జాయిన్ అవ్వాలని ఎస్‌బీఐ త‌న సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ప్రకటించింది.

‘బ్యాంకులో తాక‌ట్టు పెట్టి, ఎటువంటి లావాదేవీలు జరపకుండా ఆస్తుల విలువ కంటే చెల్లించాల్సిన మొత్తం ఎక్కువైనప్పుడు వాటిని వేలంలో ఉంచుతారు. ఈ ప్రక్రియను పార‌ద‌ర్శంగా నిర్వహించాలని ఎస్బీఐ ఈ వేలం ప్రక్రియ తీసుకొచ్చింది. వేలం వేసే ఆస్తుల‌కు సంబంధించి కోర్టు ఉత్తర్వులతో పాటు కావాల్సిన అన్ని పత్రాలు, వివరాలు బిడ్డ‌ర్ల‌కు అందజేస్తామని ప్రకటించింది కూడా.

వేలం కోసం ఉంచ‌బ‌డిన ఆస్తుల వివ‌రాల‌ను సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఇచ్చిన ప్ర‌కట‌న‌లో అందించిన లింక్‌ల ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఆసక్తి ఉన్న వారు వేలం వేసే విధానం, కొనుగోలు చేయాల‌నుకునే ఆస్తి గురించి సందేహాల నివృతి కోసం సంబంధిత బ్రాంచ్‌ల‌ను సంప్ర‌దించి క్లియర్ చేసుకోవచ్చు.

………………………………………….: అయ్పప్ప భక్తులకు సూచనలు..తప్పకుండా పాటించాలి

ఈ వేలంలో పాల్గొనడానికి అర్హతలు… నియమ, నిబంధనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

* ఇ-వేలం నోటిసులో పేర్కొన్న నిర్థిష్ట ఆస్తి కోసం ఈఎమ్‌డిని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
* కేవైసి ప‌త్రాలు.. సంబంధిత ఎస్‌బీఐ శాఖకు సమర్పించాలి.
* చెల్లుబాటు అయ్యే డిజిట‌ల్ సంత‌కం రెడీగా ఉండాలి.
* ఈఎమ్‌డి డిపాజిట్ చేసి, కేవైసి ప‌త్రాల‌ను సంబంధిత శాఖ‌కు స‌మ‌ర్పించాక.. బిడ్డింగ్ లాగిన్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌ల‌ను ఈ-మెయిల్ ద్వారా అందుకుంటారు.
* వేలం నిబంధ‌న‌ల ప్ర‌కార‌ం బిడ్డ‌ర్లు అదే స‌మ‌యంలో లాగిన్ అయి వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది.
* టెర్స్మ్ అండ్ కండీషన్స్ ఫాలో అవుతున్నామని ఒప్పుకుంటూ… ‘పార్టిసిపేట్’ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.
* కేవైసి ప‌త్రాలు, ఈఎమ్‌డి వివ‌రాలు, ఎఫ్ఆర్‌క్యూ( ఫ‌స్ట్ రేట్ కొటేష‌న్‌) వివ‌రాలు అప్‌లోడ్ చేయాలి.
* ఆ త‌ర్వాత కొటేష‌న్‌ను స‌మ‌ర్పించాలి. ఆస్తి ధ‌ర రిజ‌ర్వ్‌డ్ విలువ‌తో స‌మానంగా లేదా అంత‌కంటే ఎక్కువ కానీ ఉండాలి.
* ఫైనల్ స‌బ్మిష‌న్ తర్వాత బిడ్డర్ అప్‌లోడ్ చేసిన ప‌త్రాలలో గానీ కోట్ చేసిన ధరలో గానీ మార్పులు చేయలేరని గమనించాలి.