SBI: హోం లోన్ వడ్డీరేట్లు పెంచేసిన ఎస్బీఐ

భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ హోల్డర్లకు ఇచ్చిన రుణాలపై వడ్డీరేట్లను పెంచేసింది. గత వారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా పెంచిన రెపోరేటుకు అనుగుణంగా వడ్డీరేట్లలో మార్పు తెచ్చింది.

SBI: హోం లోన్ వడ్డీరేట్లు పెంచేసిన ఎస్బీఐ

Sbi

 

 

SBI: భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ హోల్డర్లకు ఇచ్చిన రుణాలపై వడ్డీరేట్లను పెంచేసింది. గత వారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా పెంచిన రెపోరేటుకు అనుగుణంగా వడ్డీరేట్లలో మార్పు తెచ్చింది. ఈ సెంట్రల్ బ్యాంక్ రెపో రేటును 0.50 శాతం నుంచి 4.90శాతానికి పెంచింది.

ఇదిలా ఉంటే, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్‌ను 0.20శాతం పెంచి జూన్ 15నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ఫలితంగా హోం, ఆటో, పర్సనల్ లోన్ ఈఎమ్ఐలపై అధిక భారం పడనుంది.

ప్రస్తుతం 7.20శాతంగా ఉన్న మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్‌డ్ లెండింగ్ రేట్స్ (MCLR)ను 7.40శాతానికి పెంచారు. SBI జూన్ 15 నుండి అమలులోకి వచ్చే రెపో లింక్డ్ లెండింగ్ రేటు (RLLR)ని కూడా పెంచింది.

Read Also: ఎస్బీఐ లాకరు నుంచి 2.8కేజీల బంగారం దొంగతనం

వాహన, గృహ, వ్యక్తిగత రుణాలు వంటి వినియోగదారు రుణాలు MCLRకి అనుసంధానించి ఉంటాయి. MCLR విధానం వినియోగదారులకు వడ్డీ రేట్ల మెరుగు కోసం పాత ఫ్రేమ్‌వర్క్ మార్చడం ద్వారా ఏప్రిల్ 1, 2016 నుండి అమలులోకి వచ్చింది. జూన్ 8న ఆర్‌బీఐ రెపో రేటు సవరణ తర్వాత పలు బ్యాంకులు రేట్లు పెంచాయి.